నేటి నుండి 15 రోజులు ఇళ్ల పండుగ

అధికారంలోకి రాక ముందు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను అడిగిమరి తెలుసుకున్నాడు.ఆ సమయంలో సొంత ఇల్లు లేని పేదల కష్టాలను చూశానని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత ఇల్లు కట్టుకోవాలని కలలు కనే పేదవారి కోసం ఇల్లు కట్టించాలని ఆరోజే నిర్ణయం తీసుకునాన్నని తెలిపాడు.

 Ys Jagan Mohan Reddy Launch The Ysr Housing Scheme, Jagan Mohan Reddy, Padayatra-TeluguStop.com

అందుకే నేటి(శుక్రవారం) నుండి ఇళ్ల పట్టాల పంపిణీ తూర్పు గోదావరి కొమరగిరి నుండి మొదలు పెట్టి 15 రోజుల పాటుగా 175 నియోజకవర్గాల్లో ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతుందని ఈ సందర్భంగా ఏపీ సి‌ఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పాడు.

Telugu Christmas, Deeds, Godavari, Scheme, Komaragiri, Padayatra, Ys Jagan-Telug

మొదటి విడత గా 15 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతుందని అన్నాడు.రెండో విడతలో మరో 28 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతుందని అన్నాడు.రాష్ట్ర వ్యాప్తంగ 30 లక్షల మందికి లబ్ది చేకూరుతుందని చెప్పాడు.

వైకుంఠ ఏకాదశి, క్రిస్‌మస్ రోజున ఇళ్ల పంపిణీ కార్యక్రమం ప్రారంబించడం ఆనందంగా ఉంది అన్నాడు.ఇదేళ్లలో 30.75 లక్షల మందికి ఇల్లు నిర్మించబోతున్నాం అన్నాడు.దాదాపుగా కోటి 24 లక్షల మందికి లబ్ది చేకూరుతుందని వ్యాఖ్యానించాడు.

ఇళ్ల పట్టాల ఎంపిక కుల,మత, రాజకీయాలకు అతీతంగా జరిగిందని స్పష్టం చేశాడు.ఇల్లు మాత్రమే కాదు కొత్త గ్రామాలను కూడా నిర్మించబోతున్నాం అన్నాడు.

మేము మా మ్యానిఫెస్టోలో ఏదైతే చెప్పామో ఆ పనిని పూర్తి చేసుకుంటూ పోతున్నాం అని గుర్తుచేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube