జగన్ మనసులో ఉన్న కాబోయే మంత్రులు ఎమ్మెల్సీ లు వీళ్లే ?

జగన్ మనసులో ఏముంది ? జగన్ ఏ లెక్కల ఆధారంగా ఎంపిక చేస్తారు ? కులాల , ప్రాంతాలా, సీనియార్టీనా ? విధేయతా ? ఇలా సవాలక్ష సందేహాలు వైసీపీ ఎమ్మెల్యే ల్లో కనిపించింది.త్వరలో ఖాళీ కాబోతున్న రెండు మంత్రి పదవులను జగన్ ఏ విధంగా భర్తీ చేస్తాడో తెలియక సతమతం అయిపోయారు.

 Ys Jagan, Mlc Posts, Ysrcp, Srikakulam, Sidri Appalaraju, Pilli Subash-TeluguStop.com

ఎవరికి అవకాశం ఉన్న విధంగా వారు మంత్రి పదవులను సంపాదించేందుకు తమ వంతు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు.కానీ జగన్ ఏ అంశాలను ప్రాతిపదికగా తీసుకుంటారు అనేది తేలియక ఇప్పటి వరకు టెన్షన్ పడుతూనే వస్తున్నారు.

కాకపోతే జగన్ మాత్రం ఇప్పటికే కొత్తగా ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే విషయంలో క్లారిటీ కి వచ్చేసినట్లు వైసీపీలో చర్చ నడుస్తోంది.వీరే కాకుండా ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేసినట్టు ప్రచారం జరుగుతోంది.

అయితే అధికారికంగా ఈ వివరాలు బయటకు రాకపోయినప్పటికీ, కాబోయే మంత్రులు, ఎమ్మెల్సీలు వీరేనంటూ పెద్ద ఎత్తున పార్టీలో చర్చ జరుగుతోంది.

జగన్ మంత్రి మండలి ని చూస్తే వీర విధేయత, సీనియారిటీ కంటే, సామాజిక వర్గం లెక్కల ప్రకారమే మంత్రి మండలి ఏర్పాటు చేసినట్లుగా కనిపిస్తోంది.

ఇక ఇప్పటికే రాజ్యసభ సభ్యులుగా ఎంపిక అయిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ త్వరలో మంత్రి పదవులకు రాజీనామా చేయబోతున్నారు.వీరిద్దరి స్థానంలో అదే సామాజిక వర్గాలకు చెందిన వారిని జగన్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్, శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందినవారు.ఇప్పుడు ఆయన స్థానం లోకి అదే సామాజిక వర్గం, అదే జిల్లాకు చెందిన రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ , మరో మంత్రి మోపిదేవి వెంకటరమణ మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వారు.

దీంతో ఆ స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే డాక్టర్ సిధిరి అప్పలరాజు ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.

Telugu Mlc, Pilli Subash, Srikakulam, Ys Jagan, Ysrcp-Telugu Political News

స్వతహాగా డాక్టర్ అయిన అప్పలరాజు కరోనా వైరస్ విజృంభిస్తున్న ఈ సమయంలో స్థానికంగా ప్రజలకు భరోసా కల్పించే విధంగా వ్యవహరిస్తూ, ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుని అధికారులకు ఆదేశాలు ఇస్తూ, జగన్ దృష్టిలో పడ్డారు.దీంతో ఆయనకు వైద్య ఆరోగ్య శాఖ అప్పగించాలనే అభిప్రాయంలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.ఇక మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎమ్మెల్సీ పదవులకు కూడా రాజీనామా చేయబోతుండడంతో మోపిదేవి వెంకటరమణ స్థానం లో, కమ్మ సామాజిక వర్గానికి చెందిన గుంటూరు జిల్లా చిలకలూరిపేట మాజీ వైసీపీ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ కు, ఎమ్మెల్సీ ఇవ్వబోతున్నారట.

ఇక పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎమ్మెల్సీ పదవి ఇంకా తొమ్మిది నెలలే సమయం ఉండటంతో, ఆ పదవికి ఎన్నిక జరిగే అవకాశం లేదు.ఇక గవర్నర్ కోటలో రెండు ఎమ్మెల్సీ స్థానం ఖాళీ కాబోతున్న పరిస్థితులు కడప జిల్లా రాయచోటి చెందిన జకియ సుల్తానా అనే మహిళకు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నాయకుడు కొయ్యే మోషేన్ రాజు పేరును ఫైనల్ చేసినట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube