జగన్ 'యాత్ర'..జనం ఇళ్లకు తాళాలు!!!

ఓదార్పు అనే పధం వింటేనే గుర్తుకు వచ్చేది జగన్ అండ్ టీమ్…తన తండ్రి దివంగత నేత వైఎస్ఆర్ మరణంతో మొదలైన ఈ ఓదార్పు చాలా కాలమే సాగింది.అయితే.

 Jagan Mistake In Raithu Odarpu Yatra-TeluguStop.com

ప్రజా నాడి ఎలా ఉన్నప్పటికీ.జగన్ కు విపరీతమైన ప్రజాదరణ తెచ్చి పెట్టిన యాత్ర అని చెప్పుకుంటారు వైకాపా ఫ్యాన్స్.

ఇక బుగ్గలు నిమురుతూ.నెత్తిన చేతులుపెడుతూ.

ప్రేమగా పలకరిస్తూ.తనదైన మార్కు సైతం సంపాదించుకున్నాడు యువనేత.

మరో పక్క సొంత మీడియా చేతిలో ఉండటం.డబ్బా కొట్టుకోవడానికి ఏమాత్రం లోటు లేకపోవడం ఇలా అన్ని అప్పట్లో జగన్ కు బాగానే కలసి వచ్చాయి.

ఇంతవరకూ బ్రహ్మాండంగా సాగిపోయింది.కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు…ప్రస్తుతం అధికారం పసుపు జెండా చేతుల్లో ఉంది… ఇక వారిని ఎదుర్కునే క్రమంలో జగానా చాలా టెక్నిక్స్ ఉపయోగిస్తున్నప్పటికీ ఏ మాత్రం కలసి రాకపోవడంతో చేసేది ఏమీ లేక మళ్లీ యాత్రనే నమ్ముకున్నాడు.

అయితే ఈ సారి మాత్రం ఉత్తుత్తి ఓదార్పు కాదు…రైతు ఓదార్పు.రునమాఫీ విషయంలో ప్రభుత్వం పడుతున్న ఇబ్బందులను తనకు అముకూలంగా తిప్పుకోవాలని ప్రయత్నం సాగిస్తూ రైతు ఓదార్పు మొదలు పెట్టాడు.

ఇక అసలు ఇబ్బందులు అక్కడే మొదలయ్యాయి జగన్ అన్నకు…విషయం ఏమిటంటే.అనంతపురంలో జరుగుతున్న ఈ యాత్రలో జగన్ బాబు ఓదార్చిన ఒక కుటుంబానికి ఎలాంటి వ్యవసాయ నేపథ్యంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇటీవల జగన్ అనంతపురం జిల్లాలో సురేష్ అనే ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు.అయితే సురేష్ అనే వ్యక్తి కేవలం ఓ ఆటో డ్రైవర్ అని టీడీపీ నాయకులు చెబుతున్నారు.

అంతే కాకుండా సురేష్ ఓ తాగుబోతని.గ్రామంలో అతనికి ఏమాత్రం మంచిపేరు లేదని టీడీపీ నాయకులు చెబుతున్నారు.

అంతే కాదు.జగన్ ఆ ఊరికి వచ్చినప్పుడు.

ఇలాంటి యాత్రలు చూడలేమంటూ గ్రామంలోని చాలామంది ఇళ్లకు తాళాలు వేసి మరీ వెళ్లిపోయారట.మరి ఇదంతా చూస్తే జగన్ ఓదర్చే వారి లిస్ట్ ను కొంచెం పక్కాగా ప్లాన్ చేసుకుంటే ఆయనకే మంచిదని అనిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube