జ‌గ‌న్ భ‌యంతోనే లేఖ రాశాడా..!

వైకాపా అధినేత వైఎస్‌.జ‌గ‌న్‌ను ఇప్పుడు వ‌రుస టెన్ష‌న్‌లు చుట్టుముట్టుతున్నాయి.

 Ys Jagan Letter To Dgp-TeluguStop.com

జ‌గ‌న్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వ‌రుస‌పెట్టి అధికార టీడీపీ గూట్లో చేరిపోతున్నారు.కొద్ది రోజుల వ‌ర‌కు జ‌గ‌న్‌కు ఇలాంటి షాకులు ప్ర‌తి రోజు త‌గులుతూనే ఉన్నాయి.

ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ దెబ్బ‌కు విల‌విల్లాడిన జ‌గ‌న్ ఇటీవ‌ల ఆప‌రేష‌న్ రిక‌వ‌రీతో కాస్త కోలుకుంటున్నాడు.ఇత‌ర పార్టీల‌కు చెందిన ప‌లువురు సీనియ‌ర్ల‌తో పాటు ఇత‌ర‌త్రా నాయ‌కుల‌ను జ‌గ‌న్ త‌న పార్టీలో చేర్చుకుంటూ కాస్త ఉప‌శ‌మ‌నం పొందుతున్నాడు.

ఇదిలా ఉంటే దూకుడుకు మారుపేరు అన్న బిరుదు ఉన్న జ‌గ‌న్ ఇప్పుడు ఓ విష‌యంలో కాస్త టెన్ష‌న్‌తోనే ఉన్నాడ‌ట‌.అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే అనంత‌పురం జిల్లాలోని క‌న‌గాన‌ప‌ల్లె మండ‌ల ప‌రిష‌త్ అధ్య‌క్ష ఎన్నిక‌కు రంగం సిద్ధ‌మైంది.

ఇక్క‌డ ఎంపీటీసీల విష‌యానికి వ‌స్తే వైకాపా ఎంపీటీసీలే ఎక్కువ మంది ఉన్నారు.అయినా మంత్రి ప‌రిటాల సునీత ఇక్క‌డ నుంచి టీడీపీ ఎంపీపీ అభ్య‌ర్థిని రంగంలోకి దింపారు.

బ‌లాబ‌లాల‌ ఆధారంగా వైకాపా అభ్య‌ర్థి ఎంపీపీగా ఎన్నిక‌వ్వ‌డం సులువే అయినా మంత్రి సునీత ఈ ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మకంగా తీసుకుని రంగంలోకి దిగ‌డంతో ఎంపీపీ ఎన్నిక‌ల ఫ‌లితాలు తారుమారు కావ‌డం గ్యారెంటీ అన్న టాక్ అనంత రాజ‌కీయాల్లో వినిపిస్తోంది.ఇప్పుడు ఇదే విష‌యం జ‌గ‌న్‌ను టెన్ష‌న్‌కు గురి చేస్తోంది.

అలాగే అదే జిల్లా క‌దిరి ఎంపీపీ స్థానానికి కూడా ఎన్నిక జ‌రుగుతోంది.క‌దిరి మండ‌ల వైకాపా ఎంపీటీసీల‌ను సైతం టీడీపీ ఎక్క‌డ లాగేసుకుంటుందో అన్న టెన్ష‌న్ జ‌న‌గ్‌లో స్టార్ట్ అయ్యింది.

ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ క‌దిరి ఎంపీపీ స్థానానికి జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో ఎలాంటి అవ‌క‌త‌వ‌క‌లు జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని డీజీపీ నండూరి సాంబ‌శివ‌రావుకు లేఖ రాశారు.స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు పార్టీ మార‌డం పెద్ద విశేషం కాదు.

అయితే జ‌గ‌న్ ఈ చిన్న విష‌యానికి కూడా ఏకంగా డీజీపీకి లేఖ రాయ‌డం చూస్తుంటే జ‌గ‌న్ ఎంత టెన్ష‌న్ ప‌డుతున్నాడో స్ప‌ష్ట‌మ‌వుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube