టీడీపీ హవా తగ్గుతోంది.. ఆ పార్టీల హవా పెరుగుతోంది ! కారణం ఏంటి..?  

Ys Jagan Is The Next Cm Of Andhra Pradesh-

ఏపీలో అధికార పార్టీ టీడీపీ కి రోజు రోజుకి వ్యతిరేక పవనాలు వీస్తుండగా… తమ ప్రత్యర్ది పార్టీలైన వైసీపీ. జనసేన పార్టీలు జనంలో తమ పరపతిని పెంచుకొంటూ అధికార పీఠం దగ్గించుకునే దిశగా అడుగులు వేస్తుండడం టీడీపీని కలవరపెడుతోంది. అందుకే ఆ పార్టీల ప్రభావంతో తమ ఓటింగ్ శాతం తగ్గకుండా చూసుకునేందుకు టీడీపీ బద్ద శత్రువైన కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి కూడా టీడీపీ వెనుకాడలేదు..

టీడీపీ హవా తగ్గుతోంది.. ఆ పార్టీల హవా పెరుగుతోంది ! కారణం ఏంటి..? -YS Jagan Is The Next Cm Of Andhra Pradesh

పుండు మీద కారం జల్లినట్టుగా… వివిధ సంస్థలు చేపట్టిన సర్వే రిపోర్టులు ఉన్నాయి. టీడీపీ హవా ఏపీలో బాగా తగ్గిందని ఈ సారి ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతినడం ఖాయం అని తేల్చేశాయి.

.

ఒకవైపు టీడీపీ గ్రాప్ తగ్గిపోతూ ఉంటె… మరో వైపు వైసీపీ గ్రాప్ అంతకంతకూ పెరుగుతోంది. మరో వైపు జాతీయ సర్వేలు, బాబు సొంత సర్వేలల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేస్తున్నాయి.

ఈ పరిణామాలు టీడీపీలో కలవరం పుట్టిస్తున్నాయి.ఇక సీట్ల విషయానికి వస్తే రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలు కలుపుకు మొత్తం 74 అసెంబ్లీ సీట్లు ఉంటే ఇందులో యాభైకి తక్కువ కాకుండా వైసీపీ గెలుచుకుంటుందని సర్వేలు తేల్చేశాయి. మిగిలి జిల్లాల్లో ఏడు జిల్లాల్లో వైసీపీకి మరో నలభై సీట్లు ఖచ్చితంగా వస్తాయని, మొత్తానికి మ్యాజిక్ ఫిగర్ ని వైసీపీ దాటి పవర్ లోకి రావడం ష్యూర్ అంటూ సర్వేలు చెప్పడంతో టీడీపీలో మరింత ఆందోళన పెరిగింది. .

అయితే… గుంటూరు, కృష్ణ జిల్లాల్లో టీడీపీకి బలం బాగా పెరిగిందని అభ్యర్థితో సంబంధం లేకుండా టీడీపీ ఇక్కడ పాగా వేస్తుందని ఈ జిల్లాల్లో బలం బాగా ఉన్నట్లుగా సర్వేలు సూచిస్తున్నాయి. అయితే అక్కడ అక్కడ జనసేన పాగా వేస్తుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఆ రెండు జిల్లాల్లో పవన్ పార్టీ జనసేన టీడీపీకీ భారీగా నష్టం కలిగించే అవకాశం కనిపిస్తుందట. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాం కాబట్టి ధీమాగా ఉండొచ్చు అనుకుంటే … అది ఎక్కడ రివర్స్ అవుతుందో తెలియని పరిస్థితి. పొత్తు వల్ల కాంగ్రెస్‌కు లాభం తప్ప టీడీపీకీ లాభం ఉండదని పార్టీ నాయకులు ఆవేదనగా చెప్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికల నాటికీ బాబు ఎటువంటి వ్యూహాలు రచిస్తాడో చూడాలి..