జ‌గ‌న్ పంచె గెట‌ప్ సీక్రెట్ ఏంటి     2017-01-12   05:03:02  IST  Bhanu C

ఏపీ విపక్ష వైసీపీ అధినేత జ‌గ‌న్ ఇటీవ‌ల బాగా చేంజ్ అయ్యాడు. జ‌గ‌న్‌లో వ‌చ్చిన చేంజ్ మామూలు చేంజ్ కాదు. గ‌తంలో పార్టీ నేత‌ల్లో త‌న‌కంటే వ‌య‌స్సులో పెద్ద‌వాళ్లైన నాయ‌కుల‌తో సైతం ఏక‌వ‌చ‌నం, పేరు పెట్టి పిలిచే జ‌గ‌న్ ఇప్పుడు అన్నా, సార్ అని చాలా మ‌ర్యాద‌గా సంబోధిస్తున్నారు. గ‌తంలో పార్టీ నాయ‌కుల‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వ‌డ‌మే క‌ష్టంగా ఉండేది. ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రికి అపాయింట్‌మెంట్ ఇస్తూ వారితో మ‌న‌సు విప్పి మాట్లాడ‌డంతో పాటు గంట‌లు త‌ర‌బ‌డి డిస్క‌ర్ష‌న్లు పెట్ట‌డం, వారి స‌ల‌హాలు తీసుకోవ‌డం చేస్తున్నాడు.

జ‌గ‌న్‌లో వ్య‌క్తిగ‌త మార్పు ఇలా ఉంటే వ‌స్త్ర‌ధార‌ణ‌లో సైతం స‌డెన్‌గా మార్పు రావ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. జ‌గ‌న్ డ్రెస్ స్టైల్ అంటే మ‌న‌కు నిలువు చార‌ల చొక్కాలు, టీ ష‌ర్టులు కామ‌న్. ఇటీవ‌ల బ్రిట‌న్ టూర్‌లో జ‌గ‌న్ టీష‌ర్ట్స్‌, జీన్స్ లుక్స్‌తో స‌రికొత్త‌గా క‌నిపించాడు. జ‌గ‌న్ ఈ మోడ్ర‌న్ లుక్‌లో సూప‌ర్బ్‌గా ఉన్నాడ‌న్న టాక్ కూడా వ‌చ్చింది.

అయితే జ‌గ‌న్ ఇటీవ‌ల క‌ర్నూలు జిల్లాలో ఓ స‌రికొత్త లుక్‌లో క‌నిపించాడు. జ‌గ‌న్‌ను ఆ కొత్త లుక్‌లో చూసి అంద‌రూ షాక్ అయ్యారు. శ్రీశైలం దేవాల‌యంలో జ‌గ‌న్ పూజ‌లు నిర్వ‌హించిన వేళ అచ్చ తెలుగు పంచెక‌ట్టులో క‌నిపించారు. జ‌గ‌న్‌ను అలా చూసి అంద‌రూ స్ట‌న్ అయిపోయారు. జ‌గ‌న్‌ను అలా చూసిన వారు ఆయ‌న తండ్రి దివంగ‌త మాజీ సీఎం వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డిని గుర్తు చేసుకున్నారు.

వైఎస్ అంటే పంచెక‌ట్టు, త‌ల‌పాగాతో ఓ రైత‌న్న‌లా క‌న‌ప‌డ‌తారు. వైఎస్ ఢిల్లీ వెళ్లినా, విదేశాలు వెళ్లినా త‌న క‌ట్టు మాత్రం మార్చ‌లేదు. పంచె కట్టుకు భారతదేశ రాజకీయాన్నే శాసించిన నేపథ్యం ఉంది. గ‌తంలో వైఎస్‌కు ముందు కూడా చాలా మంది పంచి క‌ట్టి ముఖ్య‌మంత్రుల నుంచి ప్ర‌ధాన‌మంత్రుల వ‌ర‌కు అయ్యారు.

ఏదేమైనా ఇప్పుడు వైఎస్ త‌న‌యుడు జ‌గ‌న్ సైతం ఈ స‌రికొత్త పంచెక‌ట్టు స్టైల్లో ద‌ర్శ‌న‌మీయ‌డం కొత్త చ‌ర్చ‌కు తావిచ్చింది. జ‌గ‌న్‌లో వ‌రుస మార్పులు దేనికి సంకేతం అనుకోవాలి..? 2019 ఎన్నిక‌ల కోస‌మేనా ఇదంతా అన్న చ‌ర్చ‌లు కూడా జ‌రుగుతున్నాయి.