ఎవరి నిరాహార దీక్ష అయినా ఇదే కథ

నాయకులు చేసే నిరవధిక లేదా ఆమరణ నిరాహార దీక్షల కథల ముగింపు ఒకే విధంగా ఉంటుంది.నిరాహార దీక్ష చేస్తున్న నాయకుడిని నాలుగైదు రోజుల తరువాత ఎత్తేసి ఆస్పత్రికి తీసుకు పోయి బలవతంగా వైద్యం చేస్తారు.

 Police Foil Ys Jagan’s Fast-TeluguStop.com

అంతటితో నిరాహార దీక్ష భగ్నం అయిపోతుంది.ప్రస్తుతం వై కా పా అధినేత జగన్ విషయంలోనూ ఇదే జరిగింది.

ఇందులో వింత ఏమీ లేదు.చనిపోయే వరకు దీక్ష చేయాలనీ నాయకుడు కూడా అనుకోడు.

ఆస్పత్రికి పోవాలనే అనుకుంటాడు.ఇవన్ని రాజకీయ ప్రయోజనాల కోసం సాగే దీక్షలు కాబట్టి ఇలాగే ఉంటాయి.

తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో పోలీసులు దీక్ష భగ్నం చేసి జగన్ను ఆస్పత్రికి తరలించారు.ఐ సి యూ లో చేర్చారు.

పోలీసులు దీక్షను భగ్నం చేసినప్పుడు దీక్ష మానడానికి జగన్ నిరాకరించాడు.తాను దీక్ష కొనసాగిస్తానని రొటీన్ డైలాగ్ చెప్పాడు.

ఎప్పటి మాదిరిగానే నాటకీయంగా ఆయన తరలింపు సాగింది.ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఈ అనుభవం కలిగింది.

ఇలాంటి ఘటనలు లేకపోతే నాయకుల జీవితాలు చప్పగా ఉంటాయి.జగన్ను తరలించేటప్పుడు తల్లి, చెల్లి, భార్య అక్కడే ఉన్నారు.

దీక్ష చేసాడని జగన్ గురించి చెప్పుకుంటారు గానీ ఎపీకి ప్రత్యేక హోదా రాదు కదా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube