జగన్ గాలి ఏపీలో బలంగానే ఉందా... ? కారణం ఏంటో ...?

పేష్టుటం ఏపీలో ఎన్నికల గాలులు బలంగా వీస్తున్నాయి.అయితే ఎవరి గాలి ఎలా ఉంది .? ఆ గాలి ఓట్ల పండుగ అయ్యేవరకు స్థిరంగా ఉంటుందా లేక వంకర టింకరగా వెళ్తుందా అనేది తేలడంలేదు.అనేక సర్వేలు … ఇంటలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం ఏపీలో వైసీపీ గాలి బలంగా ఉన్నట్టు తేలింది.

 Ys Jagan Have Huge Response In Ap Election In 2019-TeluguStop.com

అందుకే చంద్రబాబు కూడా లోలోపల ఆందోళన చెందుతూ… ఎక్కడలేని పధకాలను అమలుచేసుకుంటూ… మరోసారి అధికారంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడు.అయినా వైసీపీకి ఆదరణ మాత్రం ఎక్కడా తగ్గడంలేదు.సుదీర్ఘకాలం పాదయాత్ర చేసిన జగన్ ఆ సమయంలో ప్రజలతో బాగా మమేకం అయ్యారు.ప్రజలు తమ నుంచి ఏమి కోరుకుంటున్నారో…వారికి ఏం చెయ్యాలో అనే విషయంలో జగన్ కు ఒక క్లారిటీ అయితే స్పష్టంగా వచ్చేసింది.

ఇంకా అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో టీడీపీ అనేక ప్రజాకర్షక పథకాలకు పదునుపెడుతూ… వైసీపీ గాలి తగ్గించే ప్రయత్నం చేస్తోంది.

గత ఎన్నికల్లో జగన్ కు అధికారం దక్కినట్టే దక్కి చేజారిపోయింది.గత ఎన్నికల ముందు రుణమాఫీ హామీ ఇద్దామని… పార్టీ నేతలు జగన్ పై ఒత్తిడి తెచ్చినా… రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో రుణమాఫీ చేయలేమని, చేయలేని హామీని ఇవ్వలేనని జగన్ పంతానికి వెళ్లారు.కానీ ఆ ఫలితమే ఏమో కానీ.

మొత్తానికి వైసీపీ ఓడిపోయింది.ఇప్పుడు మళ్ళీ ఏపీలో ఎన్నికల సందడి మొదలయ్యింది.అందుకే… మరోసారి హామీలు, హామీల అమలు, చిత్తశుద్ధి అనే అంశాలు తెరపైకి వస్తున్నాయి.ప్రత్యేక హోదా అంశం నుంచి పార్టీ ప్రకటించిన నవరత్నాల వరకు జగన్ ఒకే మాట మీద ఉన్నారనే అభిప్రాయం ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోయింది.

జగన్ చెప్పిందే చేస్తారు… చేసిందే చెప్తారు అనే అసంకేతం ప్రజల్లో కింది స్థాయివరకు వెళ్ళిపోయింది.

అలాగే… ఏపీకి ప్రత్యేక హోదా ! ఈ విషయంలో కూడా హోదా విషయంలో జగన్ మొదటి నుంచీ ఒకే మాట మీద ఉన్నారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదానే సంజీవని అని, అది ఏపీ హక్కు అని బలంగా నమ్మడమే కాదు.అన్ని జిల్లాల్లో యువతతో సభలు నిర్వహించి హోదా వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలు చెప్పి అవగాహన కల్పించారు.

దీక్షలు, ధర్నాలు చేశారు.అయితే, ఆ సమంయలో ప్రత్యేక హోదా రాష్ట్రానికి సంజీవని కాదని టీడీపీ వాదించింది.

కానీ, జగన్ మాత్రం ఒకే మాట మీదున్నారు.కానీ ఇప్పుడు టీడీపీ ఆ వాదాన్ని తలకెత్తుకుంది.

ఇక జగన్ ఆర్భాటంగా ప్రకటించిన ‘నవరత్నాలు అనే ఎన్నికల హామీలపై మొదట తెలుగుదేశం పార్టీ విమర్శలు చేసుకొచ్చింది.అయితే వైసీపీ వాగ్దానాలు ప్రజారంజకంగా ఉండడంతో టీడీపీ వాటిని కాపీ కొట్టి అమలుచేయడం మొదలుపెట్టింది….అయితే, వాటిల్లోనే ప్రధానమైన పింఛన్ల రెట్టింపు, ఆటోలు, ట్రాక్టర్లకు ట్యాక్సుల రద్దు వంటి హామీలను ఎన్నికలకు ముందే తెలుగుదేశం అమలు చేసేస్తోంది.అయితే ఈ విషయాలన్నీ ప్రజలు ఒక కంట కనిపడుతూనే ఉన్నారు.

టీడీపీ ఎన్ని చేసినా ఏపీ లో ఫ్యాన్ గాలి వీయడం తధ్యం అనే సంకేతాలు ప్రజల నుంచే వినబడుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube