ఉందిలే మంచి కాలం... ముందు ముందునా .... అవునా జగన్ ..?     2019-01-08   15:28:18  IST  Sai Mallula

ఏపీలో ప్రస్తుతం సంక్రాంతి సందడి ఎలా ఉన్నా రాజకీయ సమంతను సందడి మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తుంది . ఏ నలుగురు కలిసి మాట్లాడుకున్నా … ఆ చర్చ అంతా….ప్రస్తుత రాజకీయ అంశాలకు సంబంధించి ఉంటోంది. మరో నాలుగైదు నెలల్లో ఎన్నికలు ఉండడంతో… ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది…? ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి…? ప్రస్తుతం ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది..? అంటూ ఎవరికి వారు రకరకాల విశ్లేషణ లు చేసుకుంటూ … పొలిటికల్ హిట్ పెంచే పనిలో పడ్డారు. ముఖ్యంగా గ్రామాల్లో ఈ విధమైన రాజకీయ చర్చలు జోరుగా సాగుతున్నాయి.

YS Jagan Have Better Future In Next Elections-Chandrababu Naidu Elections Ap Janasena Party Pawan Kalyan Pawan Janasena Tdp Ycp Ys Ysrcp

YS Jagan Have Better Future In Next Elections

టిడిపి కొత్త కొత్త ఎత్తుగడలు వేస్తూ మరోసారి అధికారం దక్కించుకునేందుకు ప్లాన్ చేస్తుండగా… వైసీపీ అధినేత వైసిపి అధినేత జగన్ పాదయాత్ర పూర్తికావస్తుండడంతో ఆ తరువాత ఏంటి పరిస్థితి అనే విషయం మీదే దృష్టంతా పెట్టాడు.

ప్రస్తుతం అనేక సర్వేలు… జనాల మాటలను బట్టి చూస్తుంటే… వచ్చే ఎన్నికల్లో టీడీపీకి గడ్డుకాలమే ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఈ పరిణామాలు టీడీపీని కలవరపెడుతుండగా… వైసీపీకి మాత్రం ఎక్కడలేని హుషారును తెస్తున్నాయి. మారిన ఈ పరిణామాలతో ఇప్పటికే కొంతమంది రాజకీయ నేతలు తమ భవిష్యత్ ప్రణాళికపై కసరత్తు చేస్తున్నారు. టీడీపీ నేతలు కొందరు వైసీపీ వైపు ఆశగా చూస్తున్నారు. వచ్చి చేరేందుకు రాయబారాలు పంపుతున్నారు.
ఇక జగన్ కూడా గతం కంటే బాగానే మారినట్టు కనిపిస్తున్నాడు. అందుకే నిత్యం ప్రజా క్షేత్రంలోనే తిరుగుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఫలితం గురించి ఆలోచించకుండా తన శాయశక్తుల తన పని తాను చేసుకుంటూ వెళ్తుండటంతో జనాల్లో కూడా జగన్ కు బాగా ఆదరణ పెరగడానికి కారణం అయ్యింది.

ఇప్పుడు ఆ భయం పట్టుకునే… ఏపీ సీఎం చంద్రబాబు జగన్ ను ఆయనకు పరోక్ష మద్దతు పలికే వారందరిని టార్గెట్ చేస్తూ… విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక జగన్ లో కూడా అప్పుడే గెలుపు ధీమా కనిపిస్తోంది. ఈ ఎన్నికలు చావో రేవో అన్నట్టుగా ఉండడంతో… గెలుపుకి కలిసివచ్చే ప్రతి అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకునే పనిలో పడ్డాడు. జగన్ చేస్తున్న పాదయాత్ర ముగింపు సందర్భంగా కొన్ని చానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చాడు.

YS Jagan Have Better Future In Next Elections-Chandrababu Naidu Elections Ap Janasena Party Pawan Kalyan Pawan Janasena Tdp Ycp Ys Ysrcp

మొన్నటివరకు రాజకీయాలకు జగన్ కొత్త సీఎం పదవిని హ్యాండిల్ చేయలేడు అనేవారికి తన మాటలతో గట్టిగానే సమాధానం చెప్పాడు. ఈ ఇంటర్వ్యూల వల్ల జగన్ పై చాలామందికి పాజిటివ్ ఫీలింగ్ వచ్చేసింది. ఇక పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఇక అధికారం చేజిక్కించుకోవడం అంత కష్టమేమి కాదు.