సీఎం జగన్ కీలక నిర్ణయం.. మహిళల రక్షణకు రవాణా శాఖ ప్రత్యేక యాప్‌..!

ఏపీ ప్రభుత్వం మహిళల భద్రత విషయంలో ప్రత్యేక జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది.ఇప్పటికే దిశ వంటి చట్టాన్ని అమలు చేసి మహిళలకు పలు సదుపాయాలను కల్పించింది.

 Ys Jagan Govt To Launch New App Women Safety,jagan Mohan Reddy, Women, Empower,-TeluguStop.com

తాజాగా ప్రభుత్వం మహిళలు స్వేచ్ఛగా ప్రయాణించేందుకు, రవాణాలో పూర్తి భద్రతను కల్పించే దిశగా అడుగులు వేస్తోంది.ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ కొత్తగా యాప్ ఆధారిత ప్రాజెక్టును చేపట్టనుందని రవాణా శాఖ వెల్లడించింది.

ఒంటరిగా ప్రయాణించే మహిళలపై కొందరు ఆటో, క్యాబ్ డ్రైవర్లు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు.ఈ వేధింపులను అరికట్టేందుకు ప్రభుత్వ ఈ నిర్ణయం తీసుకుంది.

నిర్భయంగా మహిళలు ఆటోలు, క్యాబ్ లలో తిరిగిలా ఈ ప్రాజెక్ట్ ను రూపొందిస్తోంది.ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 శాతం భాగస్వామ్యంతో నిధులు కేటాయించనున్నారని, దీనికి కేంద్రం కూడా ఒప్పుకుందన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాజెక్ట్ కోసం రూ.135 కోట్లు ఖర్చు చేయనుంది.కాగా, గతంలో టీడీపీ ప్రభుత్వ ప్రభుత్వం ఈ ప్రతిపాదనపై కేంద్రం తన వాటాగా రూ.56 కోట్ల నిధులు కేటాయించినా పట్టించుకోలేదని ఆరోపించారు.
అయితే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రణాళికను ప్రభుత్వం ఇప్పటికే రూపొందించింది.మహిళల రక్షణను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో ఆటోలు, క్యాబ్ లలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) బాక్స్ ను ఏర్పాటు చేస్తారు.

వీటితో పాటు రవాణా శాఖ యాప్ ను కూడా ఇన్ స్టాల్ చేస్తారు.దీని సాయంతో మహిళలకు ప్రయాణంలో ఏదైనా ఇబ్బందులు ఎదురైతే మొబైల్ యాప్ నుంచి వెహికల్ నంబర్ పంపితే జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) సాయంతో మీరెక్కడున్న కనుక్కోవచ్చు.

రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఆటోలు, లక్ష వరకు క్యాబ్ లు ఉన్నాయని రవాణాశాఖ వెల్లడించింది.ఈ వాహనాలల్లో దశలవారీగా ఐఓటీ బాక్సులను ఏర్పాటు చేస్తారు.వీటి పర్యవేక్షణ బాధ్యతలు రవాణా, పోలీస్ శాఖ ఉంటుందన్నారు.డ్రైవర్లకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిటీ టెక్నాలజీ కార్డులు జారీ చేస్తామన్నారు.పైలెట్ ప్రాజెక్ట్ గా మొదటగా విజయవాడలో అమలు చేయనున్నారు.

ప్రాజెక్టును అక్టోబర్ నెలలో సీఎం జగన్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించనున్నట్లు రవాణా శాఖ వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube