ఎస్పీ బాలసుబ్రమణ్యంకు జగన్ ప్రభుత్వం ఘన నివాళి.. ఎలా అంటే..!

ప్రపంచంలోనే అత్యధిక పాటలు పాడి గిన్నిస్ బుక్ రికార్డ్ ను సాధించిన గాయకుడిగా ఎస్పీ బాలసుబ్రమణ్యం పేరు తెచ్చుకున్నారు.గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రస్తుతం భూమి మీద జీవించకపోయినా ఎప్పటికి సినీ ప్రేక్షకుడి మనసులోనే ఆయన స్వరం అలాగే గుర్తుండిపోతుంది.

 Ap Govt Names Music School After Sp Bala Subrahmanyam,  Sp Bala Subrahmanyam,ap-TeluguStop.com

ఏ సందర్భంలో అయినా సరే రోజుకి ఒక్కసారైనా చాలామంది బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలు మనం వింటూనే ఉంటాం.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాలో పుట్టి పెరిగిన ఆయనకు తెలుగు సినీ ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసుకున్నారు.

ఇటువంటి చిరస్మరణీయుడుకి తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘన నివాళి అర్పిస్తూ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం మరణానంతరం ఆయనకు గుర్తుగా నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాలకు డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం పేరు పెట్టి ఆయనకు ఘన నివాళులు అర్పించే ప్రయత్నం చేశాడు ముఖ్యమంత్రి జగన్.ఇందుకు సంబంధించి తాజాగా ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి.

ఈ విషయాన్ని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి సోషల్ మీడియా వేదికగా తెలిపారు.ఈ విషయంపై ఆయన బాలసుబ్రమణ్యం కొడుకు ఎస్.పి.చరణ్ తన తండ్రి పేరును ప్రభుత్వ పాఠశాలకు పెట్టడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ ఆ పోస్ట్ ను రీట్వీట్ చేశారు.

ఈ సందర్భంగా ఎస్.పి.చరణ్ స్పందిస్తూ.తన తండ్రకి ఇచ్చిన గౌరవం పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ విషయంపై తెలుగు సినీ ప్రేక్షకులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు.నెల్లూరు జిల్లాలో పుట్టి పెరిగిన ఎస్పీ బాలసుబ్రమణ్యం నెల్లూరు తో ప్రత్యేక అనుబంధం కలిగి ఉంది.

ఆయన తీరిక సమయాల్లో నెల్లూరు నగరానికి వచ్చి వారి బాల్య స్నేహితులతో గడిపిన రోజులు కూడా ఎన్నో ఉన్నాయి.అంతేకాదు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం నెల్లూరులోని బాలసుబ్రహ్మణ్యం తన సొంత ఇంటిని వేద పాఠశాల కోసం దానం చేశారు కూడా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube