ఒకటి నుంచి ఐదో తరగతుల విషయంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. !!

ఇటీవల సోమవారం నాడు విద్యాశాఖ అధికారులతో సీఎం వైఎస్ జగన్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఫిబ్రవరి ఫస్ట్ నుండి పరిశుభ్రమైన మరుగుదొడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

 Ys Jagan Govt About School Re Opening, Instructions To Schools, Social Distance,-TeluguStop.com

స్కూల్ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలని, మరుగుదొడ్లు వంటి వసతులు లేకపోవడం వల్ల చాలా మంది పిల్లలు స్కూల్ కి రాని పరిస్థితి కూడా ఉందని చెప్పుకొచ్చారు.
ఫిబ్రవరి మొదటివారం నుంచి ఒకటి నుంచి ఐదో తరగతి వరకు రాష్ట్రంలో అన్ని పాఠశాలలో ఓపెన్ అయ్యే పరిస్థితి ఉండటంతో విద్యా కానుక టెండర్ల ప్రక్రియను వెంటనే పూర్తి చేసి సకాలంలో విద్యార్థులకు అందించాలని ఆదేశించారు.

అంతేకాకుండా రాబోయే ఏడాది విద్యాసంవత్సరంలో ఇంగ్లీష్ మీడియం బోధన పై దృష్టి పెట్టాలని సూచించారు.అదే విధంగా విద్యార్థులు పాఠశాలకు రాకపోతే మొదట వాళ్ల తల్లిదండ్రులకు మెసేజ్ పంపించాలి తరువాత గ్రామ సచివాలయ వాలంటరీ ద్వారా అధికారుల ద్వారా యోగక్షేమాలు తెలుసుకోవాలి దీన్నంతా మోనిటర్ సచివాలయ సిబ్బంది చేయాలని ఈ సమావేశంలో విద్యాశాఖ అధికారులతో జగన్ చర్చించారు.

కచ్చితంగా పిల్లలు స్కూలుకు వచ్చేలా పరిస్థితులు మార్చాలని సీఎం జగన్ ఆదేశించారు. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube