జగన్ ఎంత చేస్తున్నా ఫలితం అంతంతమాత్రమేనా ?

గత టిడిపి ప్రభుత్వం హయాంలో పెరిగిపోయిన అవినీతి అరాచకాల నుంచి విసిగిపోయిన ప్రజలకు తామే ప్రత్యామ్న్యాయం అని వైసీపీ బలంగా ప్రచారం చేసుకుంది.ఫలితంగా ఎన్నికల్లో టీడీపీని ఓడించి వైసీపీకి ప్రజలు అధికారం కట్టబెట్టారు.

 Ys Jagan Govt Facing New Problems-TeluguStop.com

ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్ చేపట్టిన పాదయాత్ర కూడా ఒకరకంగా వైసీపీ విజయానికి కారణం అయ్యింది.ఆ యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది.

ఆ యాత్రలో ప్రజల కష్టాలను ఎదుర్కొంటున్న కష్టాలను, ఇబ్బందులను చూసి జగన్ అనేక సంక్షేమ పథకాలను తమ మేనిఫెస్టోలో చేర్చారు.అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టో లో ఉన్నఅంశాలను అమలు చేసేందుకు జగన్ మొదటి ప్రాధాన్యం ఇచ్చారు.

కానీ ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల్లోనే అనేక వివాదాల్లో చిక్కుకుపోయింది.దీంతో వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి రోజు రోజుకి పెరుగుతున్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి.

మెజార్టీ ప్రజలు ఏరికోరి అధికారం కట్టబెడితే ఆదిలోనే ఈ స్థాయిలో వ్యతిరేకత మూటగట్టుకోవడం ఆ పార్టీ లోను అసంతృప్తికి కారణం అవుతోంది.

వివిధ సమస్యలపై నిత్యం ధర్నాలు, నిరసనలు ఏపీలో పెరిగిపోతున్నాయి.

సంక్షేమ పథకాలు ఎంత చిత్తశుద్ధితో అమలు చేస్తున్నాఆశించిన స్థాయిలో ప్రభుత్వానికి పేరు రావడం లేదు.తాజాగా ఏపీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న కరెంటు కోతలు పై జనం కూడా ఆగ్రహంగా ఉన్నారు.

వేసవి కాలం ముగిసిన తరువాత విస్తారంగా వర్షాలు కురుస్తున్నప్పటికి ఈ కోతలు ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇక పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పనకు రూపకల్పన చేసి భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఒకదాని తర్వాత ఒకటి జారీ చేశారు.

ముఖ్యంగా గా పార్టీని, ప్రభుత్వ పరపతిని బలిష్టం చేయాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టారు.అయితే వాటిల్లో అనేక అక్రమాలు జరిగాయని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా, వైసిపి ప్రభుత్వం దానిని సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయింది.

ఇక ఈ ఉద్యోగాల కల్పనపై కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.చివరకు వివిధ శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగులు గా పనిచేస్తున్న ఉద్యోగులు కూడా ఆందోళన చెందుతున్నారు.

Telugu Ap Surveyors, Problems, Ap, Ys Jagan-Telugu Political News

 

మచిలీపట్నంలో రెండు రోజుల క్రితం రెవెన్యూ లైసెన్స్డ్ సర్వేయర్లు ధర్నాకు దిగారు.గ్రామ సచివాలయం లో గ్రామ సర్వే నియామకానికి ప్రభుత్వం చర్యలు తీసుకున్న నేపథ్యంలో 2008వ సంవత్సరం నుంచి లైసెన్స్ సర్వే పనిచేస్తున్న తమ ఉపాధికి గండిపడే పరిస్థితి ఏర్పడిందన్నారు.దీని కారణంగా తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పాదయాత్ర సమయంలో జగన్ తమను అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు ఈ విధంగా అన్యాయం చేస్తున్నారని వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఇలా చెప్పుకుంటూ వెళితే అనేక విషయాలను వైసీపీ ప్రభుత్వం ప్రజల నుంచి నిరసనలు ఎదుర్కుంటోంది.ఇవన్నీ జగన్ కు తెలిసి జరుగుతున్నా, తెలియక జరుగుతున్నా నష్టం మాత్రం వైసిపి ప్రభుత్వానికి తీవ్రంగానే మారింది.

ప్రభుత్వం ఏర్పడిన కొద్ది నెలల్లోనే ఈ స్థాయిలో వ్యతిరేకత రావడం ఆ పార్టీ వర్గాలను కూడా కలవరపెడుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube