ఫిట్ మెంట్ 23.29 శాతం పెంచి పదవీ విరమణ వయసు పెంచిన సీఎం జగన్..!!

ఉద్యోగ సంఘాల నాయకులతో సీఎం జగన్ భేటీ అయిన అనంతరం.కీలక ప్రకటన చేయడం జరిగింది.

 Ys Jagan Governament Good News To Employess , Ys Jagan, Ap Governament-TeluguStop.com

రాష్ట్రంలో కరుణ సంక్షోభం అదేరీతిలో ప్రతికూల పరిస్థితుల కారణంగా… వచ్చే ఆదాయం తగ్గడంతో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు.మంచి చేయాలనే తపనతోనే అంతా ఆలోచించి.

నిర్ణయాలు తీసుకున్నామని స్పష్టం చేసి.ఫిట్ మెంట్ 23.29 శాతం పెంచి.పదవీ విరమణ వయసు 60 నుంచి 62 వరకు పెంచినట్లు జగన్ స్పష్టం చేశారు.

ఫిట్ మెంట్ విషయంలో కమిటీ చెప్పినా మిగతా అన్ని వర్గాలకు ఉపయోగకరమైన నిర్ణయం తీసుకున్నామని పెంచిన 2022 జనవరి 1 నుండి వర్తిస్తాయి అని స్పష్టం చేశారు.

అదే రీతిలో పెండింగ్.డీఏలు కూడా జనవరి జీతంతోనే కలిపి చెల్లిస్తామని పేర్కొన్నారు.2020 ఏప్రిల్ నుండి అంటే ఇరవై ఒక్క నెల ముందు నుంచే మానిటరీ బెనిఫిట్స్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.పీఆర్సి అమలుతో రాష్ట్ర ప్రభుత్వంపై 10,247 కోట్ల భారం పడిందని చెప్పుకొచ్చారు.ఇదే టైమ్ లో కరోనా కారణంగా మరణించిన కుటుంబాలలో.ఆ కుటుంబానికి చెందిన సభ్యులకు ఇచ్చే.ఉద్యోగ నియామకాలు జూన్ 30 లోపు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

గ్రామ సచివాలయ ఉద్యోగులకు జూన్ 30 లోపు ప్రొఫెషన్ కన్ఫర్మేషన్ డిక్లేర్ చేస్తామని… జులై నుండి సవరించిన జీతాలు అందుకుంటారని చెప్పుకొచ్చారు.ఇక ఇదే తరుణంలో సొంత ఇల్లు లేని ప్రభుత్వ ఉద్యోగస్తులకు రాష్ట్ర ప్రభుత్వం కడుతున్న టౌన్ షిప్ లో 10% ఫ్లాట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.

హెల్త్ కార్డు సమస్యను కూడా మరో రెండు వారాల్లో పరిష్కరిస్తామని ఉద్యోగస్తులకు.సీఎం జగన్ హామీ ఇచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube