ఆ '15 మంది ఎమ్మెల్యేల'కి... జగన్ హ్యాండ్..!!!

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలో తీసివేతలు, కూడికల లెక్కలు జరగడం సహజమే, పార్టీ కి ఎటువంటి వ్యక్తులు అవసరం, ఎవరిని పార్టీలో పెట్టుకుంటే పార్టీకి మేలు జరుగుతుంది, ప్రజలలో ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేల పై ప్రజా అభిప్రాయం ఎలా ఉంది అనే అన్ని అంశాలని పరిగణలోకి తీసుకుని ఎవరు ఉంచాలో, ఎవరిని తుంచాలో డిసైడ్ చేస్తారు.ఈ క్రమంలోనే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేపై దృష్టి పెట్టారని తెలుస్తోంది.

 Ys Jagan Gives Hand That 15 Members Of Ycp-TeluguStop.com

దాదాపు 15 సిట్టింగుల సీట్ల కి కత్తెర పడిందని అంటున్నారు.

గత ఎన్నికల్లో విజయం సాధించిన వైసీపీ ఎమ్మెల్యేలలో దాదాపు 15 మంది పై ఆయా స్థానిక ప్రజలు తీవ్ర వ్యతిరేకత చూపుతున్నారట…ఈ వ్యతిరేకతకి అనేక రకాల కారణాలు ఉన్నాయి.ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలకి చంద్రబాబు ఆయా నియోజకవర్గాల వారిగా అభివృద్దికి నిధులు ఇవ్వకపోవడం ఒక కారణమైతే.ఆ నియోజక వర్గాల్లో తెలుగుదేశం నేతలకి అభివృద్ధి కోసం నిధులని ఇవ్వడం, వారు స్వాహా చేయడం పైగా

మీ నియోజకవర్గానికి నిధులు ఇచ్చాము అయినా అభివృద్ధి జరగలేదని అంటూ ఎమ్మెల్యే కి మరకలు అంటించడం దాంతో సదరు ఎమ్మెల్యే పై ప్రజా వ్యతిరేకత హెచ్చు మీరడం జరుగుతూ వచ్చింది.

ఇలా రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యేలు చాలా మంది ఈ సమస్యని ఎదుర్కుంటున్నారు.అయితే కొంతమంది నిధుల విషయంలో పక్కన పెడితే ప్రజలలో వారు చొచ్చుకుని పోవడంలో కాని, లేక ప్రజా అభిమానం సంపాదించడం లో కాని పూర్తిగా వెనుక బడిఉన్నారట.

అయితే అలాంటి ఎమ్మెల్యే లపై తాజాగా జగన్ సర్వే చేయించగా ఆ సర్వేలో సైతం పూర్తి వ్యతిరేకత ఉండటంతో వారిలో కొంతమంది ఎమ్మెల్యేలని జగన్ పక్కన పెట్టనున్నారని టాక్ వినిపిస్తోంది.అయితే మరో పక్క టీడీపీ ప్రలోభాలని సైతం తట్టుకుని అటువైపు వెళ్ళకుండా జగన్ కోసం ఉండిపోయిన వారు కూడా ఈ లిస్టు లో ఉన్నారట మరి జగన్ వీరిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే అంటున్నారు పరిసీలకులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube