“వంగవీటి రాధా” కి జగన్ షాక్..అసలు కధ ఇప్పుడు మొదలు..       2018-04-14   07:25:32  IST  Bhanu C

వంగవీటి రాధా విషయంలో వైఎస్ జగన్ మరో మారు డ్రామా ఆడుతున్నారు..గత కొంతకాలంగా వైసీపి పార్టీకి వంగవీటి రాధా కి మధ్య జరుగుతున్న గొడవల విషయం అందరికీ తెలిసిందే..వైసీపిని రాధా వీడుతున్నారు టిడిపి లోకి గానీ జనసేన లోకి గాని వెళ్తారు అని వార్తలు వచ్చిన నేపధ్యంలో రాధా అలాంటిది ఏమి లేదని కొట్టి పడేసిన సందర్భాలు అనేకం అయితే వైసీపి అభిమానులని వంగవీటి రాధా అభిమానులని పిచ్చోళ్ళని చేస్తూ జగన్ ఆడిన నాటకం అంతా ఇంతా కాదు.. మొన్నటికి మొన్న పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాడు అంటూ డ్రామా ఆడిన గౌతంరెడ్డి, నెల రోజుల క్రితం వైఎస్ జగన్ ను పాదయత్రలో కలవటం సంచలనం అయ్యింది…


వైఎస్ జగన్ దగ్గరి బంధువు అయిన గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ వంగవీటి రంగాను చంపడం తప్పు కాదు అంటూ చేసిన వ్యాఖ్యలతో.. విజయవాడ అట్టుడికింది అంతేకాదు యావత్ కాపు నాయకులు జగన్ పై మండి పడ్డారు దాంతో కాపుల గౌతంరెడ్డిని పార్టీ నుండి సస్పెన్షన్ చేస్తున్నాం అంటూ, అప్పట్లో వైసీపీ ప్రకటించింది…గౌతమ్‌రెడ్డికి వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని, ఆయన తమ పార్టీ సభ్యుడు కూడా కాదని, ఆయన్ను సస్పెండ్ చేసాం అని చెప్పారు.. విజయసాయి రెడ్డి ఇది ఇలా ఉండగానే, ఈ రోజు జగన్ తన పాదయాత్రలో భాగంగా విజయవాడలో అడుగు పెట్టారు..

అయితే రాజకీయ సమీకారణాల నేపధ్యంలోనో మరి వంగవీటి రాధా అవసరం ఇక లేదని అనుకున్నాడో ఏమో గౌతం రెడ్డి సస్పెన్షన్ ఎత్తి వేస్తూ, లోటస్ పాండ్ నుంచి ఉత్తర్వులు వచ్చాయి… సరిగ్గా, జగన్ విజయవాడలో అడుగుపెట్టిన క్షణమే, గౌతం రెడ్డి పై సస్పెన్షన్ ఎత్తేశారు..ఈ విషయం తెలుసుకున్న రాధా వర్గం ఒకింత షాక్ కి గురయ్యింది..తన తండ్రిని ఘోరంగా అవమానించిన వాడిని పక్కన పెట్టుకుని తిరగడం ఎంతవరకూ సబబు అని ప్రశ్నించిన రాధా మరి ఈ పరిణామానికి ఎలా స్పందిస్తారోనని వంగవీటి వర్గం ఎదురు చూస్తున్నారు..

అసలు విజయవాడలో ఈసమంతా కూడా పట్టులేని వైసీపికి వంగవీటి ఫ్యామిలీ కొన్నేళ్ళ నుంచీ జెండా భుజాన పెట్టుకుని మోస్తోంది ఈ తరుణంలో జగన్ ఇలాంటి డెసిషన్ తీసుకోవడం ఇప్పుడు రాజకీయ వర్గాలలో కలకం రేపుతోంది…ముఖ్యంగా కాపు వర్గాలలో ఈ నిర్ణయం మరింత రెచ్చేగొట్టే ధోరణిలోకి తీసుకువెళ్ళింది..అయితే తెలిసి తెలిసి జగన్ కాపులని దూరం చేసుకోడు అయినా సరే గౌతమ్ రెడ్డి పై సస్పెన్షన్ ఎత్తివేశారు అంటే తప్పకుండా రాజకీయ వ్యుహ్యం అమలు చేస్తున్నాడు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు..మరి రాధా ప్రస్తుత పరిణామాలపై ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే..