“జగన్” ఈ ఒక్క హామీ హాలు..”చంద్రబాబు దుకాణం” సర్దేయడానికి       2018-05-02   03:09:11  IST  Bhanu C

జగన్ మోహన్ రెడ్డి ఏపీ ప్రతిపక్ష నాయకుడి హోదాలో తనవంతు భాద్యతని అంతఃకరణ శుద్దితో పాటిస్తున్న నేతగా ఎంతో సక్సెస్ అవుతున్నారనే టాక్ ప్రజల నుంచీ వినిపిస్తోంది..ఒక పక్క నిర్విరామంగా పాదయాత్రలు చేస్తూ కేడర్ లో ఫుల్ జోష్ నిపుతున్నారు అని కార్యకర్తలు నేతలు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు..ఇదిలాఉంటే మరో పక్క చంద్రబాబు నాయుడు పాడిందే పాటగా జగన్ పై విమర్శలు చేస్తున్నారు తప్ప హోదా కోసం పోరాడింది లేదు అంటూ వైసీపి నేతలు విమర్శలు చేస్తున్నారు..అయితే జగన్ ఇప్పుడు తన యాత్రలో మరింత జోష్ నింపేందుకు కొత్త వ్యూహాలతో ముందకు వెళ్తున్నారు..


తాజాగా కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెడుతానని చెప్పి తెలుగుదేశం గుండెల్లో రైళ్ళు పరిగెత్తించిన జగన్ ఇప్పుడు మరొక హామీ ప్రకటించి చంద్రబాబు కి నిద్రలేకుండా చేస్తున్నారు.. బాబుకు.. తనకు మధ్య హామీల విషయంలో ఎంత అంతరం ఉంటుందన్న విషయాన్ని అందరికి అర్థం అయ్యేలా చేశారు.. పేదోడి సొంతింటికలను చంద్రబాబు వ్యాపారం చేశారు తమ ప్రభుత్వం అధికారం లోకి వస్తే సొంతింటికలను ఎలా తీరుస్తామో వివరంగా చెప్పుకొచ్చారు. ఇంతకీ జగన్ ఇచ్చిన హామీని విషయంలోకి వెళ్తే..

వైఎస్సార్ బ్రతికి ఉన్నప్పుడు పేదవాడి సొంత గూడు కల నెరవేర్చారు కానీ చంద్రబాబు ఒక్క ఇల్లు అయినా కట్టాడా అని ప్రశ్నించారు.. బెల్ కంపెనీని ఇక్కడి నుంచి మార్చేసి ఆ స్థలాన్ని చంద్రబాబు ప్రభుత్వం పెద్ద కుంభకోణంగా చేయబోతోంది…అయితే ఆ స్థలంలో పేదవారికి ఇళ్లు కట్టిస్తామని చెప్పి కొత్త కథ చెబుతున్నారు. ఒక్కొక్కరికి 300 అడుగుల ఫ్లాటును అడుగుకు రూ.2 వేలు చొప్పున రూ.6లక్షలకు పేదవారికి అమ్ముతారు అయితే లిఫ్టు – గ్రానైట్ – మార్బుల్ ఫ్లోరింగ్ లేని భవనంలో చెక్క సామగ్రి ఏమీ లేకుండా అడుగు ధర ఎంత ఉంటుందని ఏ బిల్డర్ ను అడిగినా రూ.1000 మించదని చెబుతున్నారు.

ఈ లెక్కలో చంద్రబాబు భారీ అవినీతికి పాలపడుతున్నారు…వచ్చే ఎన్నికలలో మన ప్రభుత్వం రాగానే ప్రతి పేదవాడికీ రూపాయి ఖర్చు లేకుండా ఇల్లు కట్టిస్తాను. ఆ ఇంటిని అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్టర్ కూడా చేసిస్తాం. ఎపుడైనా డబ్బు అవసరమైతే ఆ ఇంటిని కుదువ పెట్టి పావలా వడ్డీకే రుణం వచ్చేలా చేస్తాం” అంటూ భారీ హామీ ఇచ్చేశారు…జగన్ ఈ హామీతో చంద్రబాబు గొంతులో వెలక్కాయి పడినట్టు అయ్యింది..

అయితే జగన్ ఇచ్చిన మరి కొన్ని హామీలు తెలుగుదేశం పార్టీకి నిద్రలు లేకుండా చేస్తున్నాయి అవేమిటంటే

1. ఉద్యోగులకు సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తాం.

2. కొత్తగా ఏర్పాటు చేసే పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇచ్చేలా నిర్ణయం…ఇందుకు సంబంధించి అసెంబ్లీ మొదటి సమావేశంలోనే చట్టం తెస్తాం.

3. ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్న 10 మంది నిరుద్యోగులకు అందులో ఉద్యోగాలు ఇచ్చి గ్రామ పాలన కొనసాగిస్తాం. 4. రాష్ట్రం విడిపోయినప్పుడు 1.42 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని లెక్కలు కట్టారు. నాలుగేళ్లలో ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. మన ప్రభుత్వం అధకారంలోకి వచ్చిన వెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తాం.

5. కులం – మతం – పార్టీలు చూడకుండా అర్హులైన వారు పెన్షన్ – రేషన్ కార్డు – మరుగుదొడ్లు – ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లో మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటాం.

6. ఒక్కో గ్రామ సచివాలయంలో స్థానికంగా ఉన్న వారికి 10 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే రాష్ట్ర వ్యాప్తంగా 1.50 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు అవుతుంది.

ఇప్పుడు ఈ హామీలు తెలుగుదేశం గుండెల్లో రైళ్ళు పరిగేట్టేలా చేస్తున్నాయి..మరి తెలుగుదేశం పార్టీ నేతలు జగన్ హామీలపై కౌంటర్ ఎలా ఇస్తారో వేచి చూడాలి..