టీడీపీ ఫార్ములాతో వైసీపీ ! ఇలా దెబ్బకొట్టేందుకు స్కెచ్

ఎత్తులు పైఎత్తులు వేయడంలో రాజకీయ పార్టీలు బాగా ఆరితేరి పోయాయి.తమ బలం పెంచుకునేందుకు ప్రతి పార్టీ పక్క పార్టీలో ఉన్న బలమైన నాయకులను గుర్తించి వారు తమ పార్టీలోకి వచ్చేలా ఆపరేషన్ ఆకర్ష్ చేపడుతున్నారు.

 Ys Jagan Follows Chandrababu Naidu For Next Elections-TeluguStop.com

ఈ నేపథ్యంలో వారికి అనేక తాయిలాలు ఆఫర్లు ప్రకటించి ఏదో ఒక రకంగా వారు తమ పార్టీలో చేరేలా వ్యూహాలు రచిస్తున్నారు.ఈ విధంగానే ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదట్లోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి తీసుకుంది.

వారిలో కొంతమందికి మంత్రి పదవులు కూడా ఇచ్చేసింది.

ఈ పరిణామం అప్పట్లో పెద్ద రాజకీయ సంచలనం అయింది.ఈ విషయంపై అప్పట్లో వైసిపి కూడా పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేసింది.పార్టీ మారిన వారి పై అనర్హత వేటు వేయాలంటూ అనేక ఫిర్యాదులు కూడా చేశారు.

అయితే ఆ తర్వాత షరా మామూలే అన్నట్టు గా ఆ విషయాన్ని వైసీపీ వదిలేసింది.ఇక అప్పటి నుంచి టిడిపి వైసీపీలో ఉన్న ద్వితీయ స్థాయి కీలక నాయకులను కూడా తమ పార్టీలో చేర్చుకుని వైసీపీని బాగా దెబ్బ కొట్టింది.

ప్రస్తుతం ఏపీలో ఎన్నికలకు మూడు నెలలు కూడా సమయం లేకపోవడంతో… టిడిపి ఉపయోగించిన ఫార్ములానే ఎన్నికలకు ముందు ఉపయోగించి ఆ పార్టీని దెబ్బ తీయాలని వైసిపి భావిస్తోంది.దీనిలో భాగంగానే టీడీపీలో బలమైన నాయకులు గుర్తించి వైసీపీలో చేర్చేలా ప్రత్యేకంగా ఒక టీం ను జగన్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.

ఇప్పటికే కడప జిల్లా రాజంపేట టిడిపి ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్రెడ్డి వైసీపీలో చేరిపోయారు.

ఈ పరిణామం టిడిపికి కలిగించింది ఆయన కాకుండా ఇంకా అనేక మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వచ్చేందుకు రాయబారాలు పంపుతున్నారు వైసిపి ప్రకటించి టిడిపి మరింత గందరగోళంలోకి నెట్టింది.ఇక పాదయాత్ర పూర్తవడంతో జగన్ ఎక్కువగా చేరికల విషయం మీదే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.రాజకీయంగా… బలమైన నాయకులను తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా ప్రత్యర్థి పార్టీలను దెబ్బకొట్టొచ్చు అనే విషయాన్ని జగన్ గ్రహించి ఇప్పుడు అమలు చేస్తున్నారు.

జగన్ టార్గెట్ చేసిన వ్యక్తులు ఆషామాషీ వారి కాదు.నిత్యం తనపై ఒంటి కాలుతో లేస్తూ… లేనిపోని విమర్శలు చేస్తూ… చికాకు తెప్పించేవారే.నెల్లూరు జిల్లాకు చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ విషయంలో ఎప్పుడూ ముందుంటారు.అందుకే ఆయన నోరు నొక్కడానికి ఆయన బావ, అల్లుడుని పార్టీలోకి చేర్చుకుని ఆయనకు ఝలక్ ఇచ్చింది వైసీపీ.

అలాగే మంత్రి అయ్యన్నపాత్రుడు సోదరుడు సన్యాసి పాత్రుడిని వైసీపీలోకి ఆహ్వానించి మంత్రిగారికి జలక్ ఇవ్వాలని వైసీపీ చూస్తోంది.జగన్ సొంతిల్లు , పార్టీ ఆఫీసు అమరావతిలో ఈ నెల వచ్చే నెల 14వ తేదీన ప్రారంభం కావడంతో అక్కడి నుంచి భారీ ఎత్తున చేరికలు ఉండేలా వైసీపీ ప్లాన్ చేసుకుంటోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube