జగన్ క్రేజ్ గాలివాటం లా మారిందా ..  

పైన పటారం లోపల లొటారం అన్నట్టు గా తయారయిపోయింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితి. ప్రజల మద్దతు కోసం కాళ్లకు పని చెప్పి మరీ వందల కిలోమీటర్లు నడుచుకుంటూ పార్టీని పైకి తీసుకు రావాలని ప్రయత్నిస్తుంటే అది జరక్కపోగా భారీ స్థాయిలో నష్టం జరిగిపోతుందని జగన్ శిబిరంలో ఆందోళన వ్యక్తం అవుతోంది. పార్టీకి ప్రజల్లో బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్టఘునందని పైకి గంభీరంగా చెప్తున్నా లోపల మాత్రం దడ తగ్గడంలేదట. జగన్ పాదయాత్రకు ఊహించని స్థాయిలో ప్రజలు వస్తున్నా వైసీపీ లో మాత్రం కంగారు పోవడమే లేదట. దీనికి పెద్ద రీజన్ ఉందని ఆ పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నారు.

YS Jagan Flop To Solve Partry Inner Problems-

YS Jagan Flop To Solve Partry Inner Problems

వైసీపీలో ఎందుకో తెలియని అసంతృప్తి.. రాజకీయంగా ఎక్కడో ఏదో మిస్‌ అవుతున్నామనే ఆందోళన వారిని వెంటాడుతోంది.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గతంగా ఓ కథ ప్రచారమవుతోంది.. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేతలు మాత్రం ఉత్తిదేనని కొట్టిపారేస్తున్నారు.

జగన్ పాదయాత్ర ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాను దాటేసి వెళ్ళిపోయింది. విస్తీర్ణంలో.. నియోజకవర్గాల సంఖ్యలోనూ అతి పెద్ద జిల్లాగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో జగన్‌ పాదయాత్ర రోజుల తరబడి సాగుతోంది.. జగన్‌ పాదయాత్ర మార్గంలో ఇటీవల ఓ సంస్థ సర్వే చేపట్టింది. జగన్‌ పాదయాత్రకు ముందు.. తర్వాత అక్కడ రాజకీయ పరిణామాలు ఎలా మారుతున్నాయనే అంశంపై సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో కేవలం ఒక్క నియోజకవర్గంలోనే ఆ పార్టీకి అనుకూల పరిస్థితి ఉందని తేలిందట!

YS Jagan Flop To Solve Partry Inner Problems-

ఆ సర్వే కు సంబంధించిన ఆ మ్యాటర్ కాస్త జగన్ చెవిన పడిందట. ఇక అప్పటి నుంచి జగన్ లో ఎదో తెలియని ఆందోళన మొదలయినట్టు వార్తలు బయటకి వచ్చాయి. అయితే అదంతా వట్టిదే అని కొట్టిపారేస్తున్నా … జగన్ మాత్రం మళ్ళీ ఓ సర్వే చేయించుకున్నట్టు తెలుస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేట.. పిఠాపురం బహిరంగసభలలో కాపు రిజర్వేషన్లపై జగన్‌ చేసిన ప్రకటనలు.. అంతకు ముందు పవన్‌కల్యాన్‌పై చేసిన వ్యక్తిగత విమర్శలు ఇవన్నీ తీవ్ర వ్యతిరేకతను తెచ్చిపెట్టాయని అంటున్నారు. ఇదే విషయం సర్వేల్లో కూడా తేలిందట. ఇన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర.. ఇస్తున్న హామీలు తమకు అనుకూలంగా ఎందుకు మారడం లేదని వైసీపీ నేతలు తెగ ఆందోళన పడిపోతున్నారట. .