టీడీపీ క్రేజీ ఎమ్మెల్యేపై జ‌గ‌న్ వ‌ల‌     2016-12-24   00:23:53  IST  Bhanu C

పాలిటిక్స్ అన్నాక ఎప్పుడు ఎవ్వ‌రు ఎలా రంగులు మారుస్తారో ఎవ్వ‌రికి తెలియ‌దు. నిన్న‌టి వ‌ర‌కు మ‌న‌ప‌క్క‌న ఉన్నవాడు రేపు మ‌న ప్ర‌త్య‌ర్థి శిబిరంలో చేరిపోతాడు. ఈ క్ర‌మంలోనే తెలంగాణ‌లో ఎలా ఉన్నా ఏపీలో 2019 ఎన్నిక‌లు అప్పుడే ఉత్కంఠ‌ను రేపుతున్నాయి. నిన్న‌టి వ‌ర‌కు టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు విప‌క్ష పార్టీ ఎమ్మెల్యేల‌ను వ‌రుస‌పెట్టి త‌న పార్టీలో చేర్చుకుంటుంటే కొద్ది రోజులుగా జ‌గ‌న్ సైతం ఇత‌ర పార్టీల్లో పేరున్న నేత‌ల‌ను త‌న పార్టీలో చేర్చుకుంటూ దూకుడు పెంచాడు.

కాంగ్రెస్‌లో మంత్రులుగా ప‌నిచేసిన సీనియ‌ర్ల‌తో పాటు మాజీ ఎమ్మెల్యేల‌పై వ‌ల‌వేసిన జ‌గ‌న్ వారిని వ‌ర‌స‌పెట్టి త‌న గూటికి చేర్చేసుకుంటున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల‌పై దృష్టిపెట్టిన జ‌గ‌న్ అక్క‌డ వెల్లంప‌ల్లి శ్రీనివాస్‌, కాసు మ‌హేష్‌రెడ్డి లాంటి వారిన త‌న పార్టీలో చేర్చుకున్నారు. ఈ జాబితాలోనే మాజీ ఎమ్మెల్యేలు మ‌ల్లాది విష్ణు, య‌ల‌మంచిలి ర‌వి, మ‌క్కెన మ‌ల్లిఖార్జున రావు పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

ఇవ‌న్నీ ఇలా ఉంటే టీడీపీకి బాగా ప‌ట్టున్న కీల‌క‌మైన కృష్ణా జిల్లాలో అధికార టీడీపీకి చెందిన ఓ క్రేజీ ఎమ్మెల్యేపై జ‌గ‌న్ వ‌ల వేసిన‌ట్టు తెలుస్తోంది. ఆ ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకుని చంద్ర‌బాబు మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇవ్వాల‌ని కూడా జ‌గ‌న్ స్కెచ్ వేస్తున్నార‌ట‌. ఆ ఎమ్మెల్యే ఎవ‌రో కాదు గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వంశీ. వంశీని వైకాపాలో చేర్చుకుని చంద్ర‌బాబుతో పాటు జిల్లాలో టీడీపీపై 2019 ఎన్నిక‌ల‌కు ముందుగానే మాన‌సికంగా పైచేయి సాధించాల‌ని ఎత్తులు వేస్తున్నార‌ట‌.

ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ ఈ విష‌య‌మై వంశీపై బాగా ప్రెజ‌ర్ తీసుకు వ‌స్తున్న‌ట్టు కృష్ణా పాలిటిక్స్‌లో ఇన్న‌ర్‌గా వార్త‌లు వినిపిస్తున్నాయి. వీరిద్ద‌రూ గ‌తంలోనే మంచి మిత్రులు. గ‌తంలో వంశీ-జ‌గ‌న్‌ను బ‌హిరంగంగా వాటేసుకుని పెద్ద సంచ‌ల‌నం రేపారు. అప్ప‌ట్లోనే వంశీ వైకాపాలోకి వెళ‌తార‌ని వార్త‌లు వ‌చ్చాయి. వంశీ 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి కాకుండా వైకాపా నుంచి పోటీ చేస్తార‌ని కూడా వార్త‌లు వ‌స్తున్నాయి.

వంశీకి జిల్లాలో వైకాపా నేత‌లు అయిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి రాధాకృష్ణ‌, పేర్నినాని త‌దిత‌రుల‌తో కూడా వంశీకి మంచి సంబంధాలే ఉన్నాయి. వంశీని వైకాపాలోకి తీసుకువ‌చ్చే బాధ్య‌త‌ను జ‌గ‌న్ వీరికి అప్ప‌గించార‌నే ప్ర‌చారం కూడా జిల్లాలో బ‌లంగా వినిపిస్తోంది. ఇక వంశీ కూడా ఇటీవ‌ల చంద్ర‌బాబుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

మంత్రి దేవినేని ఉమాకు ఎక్కువ ప్ర‌యారిటీ ఇవ్వ‌డం, త‌న‌కు ఇష్టం లేక‌పోయినా దేవినేని నెహ్రూను టీడీపీలోకి తీసుకురావ‌డం, త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో పేద‌ల ప‌క్షాన పోరాడుతుంటే అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న త‌నపై కేసు పెట్ట‌డం లాంటి అంశాల‌ను వంశీ జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఈ నేప‌థ్యంలో వంశీ 2019 నాటికి ఏ షాకింగ్ డెసిష‌న్ అయినా తీసుకోవ‌చ్చ‌న్న టాక్ వ‌స్తోంది. మ‌రి వంశీ అంత‌రంగం ఎలా ఉందో చూడాలి.