జ‌గ‌న్ ఆశ‌ల‌న్నీ అక్క‌డే... స‌క్సెస్ అవుతాడా...!

ప‌డ్డ‌చోటే వెతుక్కోమ‌న్నార‌నే సామెత‌ను వైసీపీ అధినేత సీఎం జ‌గ‌న్ అవ‌లంబిస్తున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.ఇప్పుడు ఆయ‌న చేప‌ట్టిన అనేక ప్రాజెక్టులు, ప‌థ‌కాలు ముందుకుసాగ‌డం లేదు.

 Ys Jagan Key Decision To Develop Districts, Ys Jagan, Districts Development, Ycp-TeluguStop.com

కానీ, కాలం గ‌డిచిపోతోంది.ప్రభుత్వం ఏర్ప‌డి.

అప్పుడే ఏడాదిన్న‌ర అయిపోయింది.ఈ స‌మ‌యంలో ఆయ‌న సంచ‌ల‌నం సృష్టించిన ప‌థ‌కాల కంటే కూడా ఆగిపోయిన ప‌థ‌కాలే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి.

దీంతో ప్ర‌భుత్వం చేస్తున్న ప‌నులు పూర్తిస్థాయిలో ప్ర‌జ‌ల‌కు చేర‌డం లేదు.మ‌రోప‌క్క‌, ప్ర‌తిప‌క్షాలు కూడా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నాయి.

చిన్న ఘ‌ట‌న జ‌రిగినా.దానిని బూత‌ద్దంలో చూపించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయి.

దీనికితోడు టీడీపీ నుంచి నేత‌ల‌ను చేర్చుకుంటున్నార‌నే వ్య‌తిరేక ప్ర‌చారం కూడా పుంజుకుంది.పోనీ.

ఈ వ్య‌తిరేక ప్ర‌చారానికి అడ్డుక‌ట్ట వేస్తూ.సంచ‌ల‌నాల దిశ‌గా అడుగులు వేద్దామంటే.

ఇప్పుడున్న ‌ప‌రిస్థితిలో సాధ్యం కావ‌డం లేదు.ఏ వ్యూహం ప‌న్ని నా.దానికి న్యాయ‌వ్య‌వ‌స్థ రూపంలోనో.కేంద్రం రూపంలోనో అడ్డుపుల్ల ప‌డుతూనే ఉంది.

దీంతో జ‌గ‌న్‌కు వైసీపీ నాయ‌కుల‌కు కూడా తీవ్ర ఇబ్బందిక‌ర ప‌రిణామం ఎదుర‌వుతోంది.అదేస‌మ‌యంలో పార్టీలోనూ నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త కొర‌వ‌డుతోంది.

ఎక్క‌డి క‌క్క‌డ నాయ‌కులు త‌న్నుకుంటున్నారు.ఆధిప‌త్యం కోసం మంత్రుల మ‌ధ్య కూడా చికాకులు వ‌స్తున్నాయి.

Telugu Ap, Chandra Babu, Districts, Tdp, Ycp, Ys Jagan, Ysjagan, Ysrcp-Telugu Po

ఈ ప‌రిస్థితిలో పార్టీలో ఒక బూమ్ తీసుకువ‌చ్చేందుకు జ‌గ‌న్ ముందు కీల‌క అవ‌కాశం ఒకే ఒక్క‌టి అంటున్నారు ప‌రిశీల‌కులు.అదే . జిల్లాల‌ను టార్గెట్ చేయ‌డం.జిల్లా అభివృద్ధి అజెండాను అందుకుంటే.

దీనిని వ్య‌తిరేకించే శ‌క్తులు అంటూ ఏవీ ఉండ‌వు.అభివృద్ధిని వ్య‌తిరేకించినా.

ప్ర‌జ‌ల్లో బ‌ల‌మైన వాయిస్ వినిపించేందుకు అవ‌కాశం ఉంటుంది.ఈ నేప‌థ్యంలో జిల్లాల అభివృద్ధి తోపాటు.

జిల్లాల విభ‌జ‌న‌పై ప్ర‌జ‌ల అభిప్రాయాన్ని సేక‌రించాలని.జిల్లా కేంద్రాల నిర్ణ‌యంపైనా ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను తెలుసు కోవాల‌ని, అదేస‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి నిధులు కూడా ఇచ్చేస్తే.

ఇప్పుడున్న ఎంతో కొంత వ్య‌తిరేక‌త‌కు క‌ళ్లెం వేయొచ్చ‌న్న‌ది పార్టీ అధిష్టానం.ప్ర‌భుత్వ పెద్ద‌ల నిర్ణ‌యంగా ఉంద‌ని చెబుతున్నారు.

మొత్తానికి వ్యూహం బాగానే ఉన్నా.జిల్లాల అభివృద్ది అంటే.

దాదాపు 500 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు చేయాల్సి వ‌స్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.ఇప్పుడు ఇంత మొత్తం జిల్లాల‌కు కేటాయించే అవ‌కాశం ఉంటుందా? అనేది కీల‌క ప్ర‌శ్న‌.మ‌రి జ‌గ‌న్ ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube