అందరినీ దూరం పెట్టాలని చూస్తున్న జగన్ ? అసలు ఏమైందంటే ?

ఎప్పుడూ ఏదో ఒక సంచలన నిర్ణయం తీసుకుంటూ, వార్తల్లో వ్యక్తిగా ఉంటూ ఉంటారు ఏపీ సీఎం జగన్.పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇదే వైఖరితో జగన్ ముందుకు వెళుతూ కనిపిస్తున్నారు.

 Ys Jagan, Visakha Lg Polymers,corona Virus,corona Effect, Jagan To Maintain Dist-TeluguStop.com

జగన్ తీసుకునే నిర్ణయం ప్రతిదీ ఆసక్తికరంగానే కాకుండా, చాలా మందికి ఆందోళన కలిగిస్తూ ఉంటుంది.ఎప్పటికప్పుడు ఊహించని ట్విస్ట్ లు ఇస్తూ, జగన్ నిర్ణయాలు వెలువడుతూ ఉంటాయి.

కరోనా వైరస్ ప్రభావం ఏపీలో మొదలైనప్పటి నుంచి జగన్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.అసలు ఆయన క్షేత్రస్థాయి పర్యటనలు ఏవీ పెట్టుకోవడం లేదు.

పూర్తిగా తన కార్యాలయానికే పరిమితమైపోతున్నారు.అక్కడి నుంచి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు.

అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు వచ్చేందుకు ఇష్టపడడం లేదు.విశాఖలో ఎల్జి పాలిమర్స్ సంఘటన జరిగినప్పుడు అక్కడికి వెళ్లారు.

పెద్దగా ఎక్కడ ఆయన ఏ కార్యక్రమాల్లోనూ పాల్గొన్నట్టు కనిపించలేదు.ఇదిలా ఉంటే రోజురోజుకు ప్రమాదకరంగా మారిపోతున్న కరోనా వైరస్ కు ఎవరు అతీతులు కాదు అన్నది మొదటి నుంచి జగన్ చెబుతున్న మాట.ఇప్పటికే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, కీలక నాయకులు చాలామంది కరోనా వైరస్ ప్రభావానికి గురయ్యారు.తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి కరోనా వైరస్ ప్రాభవానికి గురవ్వడంతో, ఇకపై ఎవరినీ తన దగ్గరకు రానివ్వకపోవడమే బెటర్ అన్న అభిప్రాయంలోకి జగన్ వచ్చేసినట్టు తెలుస్తోంది.

Telugu Corona Effect, Corona, Jaganmaintain, Visakhalg, Ys Jagan-Telugu Politica

ఇకపై అనేక పనుల నిమిత్తం తన దగ్గరకు వచ్చే మంత్రులు, కీలకమైన అధికారులు ,పార్టీకి చెందిన సీనియర్ నాయకులు వస్తూ ఉండడం, వారిని తన కార్యాలయంలోనే జగన్ కలుస్తూ ఉండడం వంటివి జరుగుతున్నాయి.ప్రస్తుతం కరోనా ప్రభావం మరింత తీవ్రంగా పెరిగింది.నిన్న ఒక్కరోజులోనే దాదాపు ఐదు వేల కేసులు ఏపీలో నమోదయ్యాయి.దీంతో ఇకపై తనను కలిసేందుకు ఎవరు రావద్దని, ఏ విషయమైనా ఫోన్ ద్వారానే సంప్రదించాలని జగన్ మంత్రులకు, కీలక నాయకులకు సూచించినట్లు తెలుస్తోంది.

అలాగే తనను కలిసేందుకు ఎవరికీ అనుమతి ఇవ్వవద్దని సీఎంవో అధికారులకు కూడా జగన్ ఆదేశాలు ఇచ్చారని తెలుస్తోంది.

కరోనా వైరస్ ప్రభావం మొదలైనప్పటి నుంచి జగన్ తరచుగా కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు.

ఇప్పుడు పార్టీలో చాలామంది నాయకులు ఈ ప్రభావానికి గురవుతూ ఉండడం, జనాల్లో ఎక్కువగా తిరుగుతున్న కారణంగా నాయకులు కరోనా బారిన పడుతుండటం, వారంతా తనను కలిసేందుకు వస్తుండడం వంటి పరిణామాలపై ఆందోళనలో ఉన్న జగన్, ఎవరితో ఏ మీటింగ్ పెట్టినా ఇబ్బందికరమే అనే అభిప్రాయానికి వచ్చి ఇప్పుడు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube