హోదా విషయంలో వైసీపీకి ఏమీ బోధపడడం లేదా...?  

ఏపీకి ప్రత్యేక హోదా అనే సెంటిమెంట్ అనే అంశాన్ని ఎన్నికల ముందు ఇప్పుడు టిడిపి మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. ఈ ఎన్నికల్లో ప్రజల మద్దతు సంపూర్ణంగా ఉండాలని చూస్తున్న టీడీపీ ఈ ఆప్షన్ ను ఎంపిక చేసుకుంది. అందుకే ఈరోజు ఢిల్లీలో దీక్ష చేపట్టారు. చంద్రబాబు ఈ దీక్షకు దేశవ్యాప్తంగా ఇరవై మూడు పార్టీలు మద్దతు కూడా ఇస్తున్నాయి. ఏపీ నుంచి రెండు ప్రత్యేక రైళ్లలో టిడిపి నాయకులు రాష్ట్ర అధికారులు కూడా ఢిల్లీకి పయనమయ్యారు. దీంతో మరోసారి ఏపీకి ప్రత్యేక హోదా అనే అంశం దేశవ్యాప్తంగా చర్చకు రాబోతుంది.

YS Jagan Dilemma About Special Status To Ask Modi-Modi Narendra Modi Tdp Ycp Ys

YS Jagan Dilemma About Special Status To Ask Modi

నిన్న ఏపీకి మోదీ రావడం… టీడీపీ మీద , లోకేష్ చంద్రబాబు మీద విమర్శలు చేయడం… దానికి కౌంటర్ గా బాబు కూడా గట్టిగా కౌంటర్ ఇవ్వడం చక చక జరిగిపోయాయి. ఈ సంఘటన జరిగిన తరువాత ఢిల్లీలో మోదీ టార్గెట్ గానే చంద్రబాబు ఈ దీక్షకు దిగారు. టిడిపి ప్రజల నుంచి మద్దతు పొందేందుకు…. ఈ ఎన్నికల్లో భారీగా ఓట్లు రాల్చే అంశం ఇదే అని టీడీపీ భావిస్తోంది. ముందు నుంచి ఈ హోదా అంశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంది. ఈ నినాదం ఎత్తుకొని ప్రజల్లోకి వెళ్లి ఒకసారి ఢిల్లీలో దీక్షకు దిగిన జగన్ పార్టీ పరిస్థితి ప్రస్తుత సమయంలో అయోమయంలో ఉన్నట్టు కనిపిస్తుంది. అసలు ఈ విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే సంకట స్థితిలో వైసిపి ఉంది.

YS Jagan Dilemma About Special Status To Ask Modi-Modi Narendra Modi Tdp Ycp Ys

ప్రత్యేక హోదా కోసం గట్టిగా మోదీని నిలదీసే పరిస్థితి లేదు. అలాగని… అలాగని అడగకుండా ఉంటే ఏపీ ప్రజలు అవుతామని భావన ఈ రెండింటి మధ్య వైసిపి ఎటూ తేల్చుకోలేక నలిగి పోతుంది. గతంలో వైసీపీ చేసిన పోరాటాలు ఆ పార్టీకి విపరీతమైన మైలేజ్ తీసుకువచ్చాయి. తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించి మరి జగన్ తన నిబద్ధత చాటుకున్నాడు. అయితే గతం గతః అన్నట్టు ఆ విషయాలు ఇప్పుడు మరుగునపడిపోయాయి. ఎన్నికల సమయం ముందు టిడిపి ఈ నినాదాన్ని గట్టిగా పట్టుకుని ప్రజల్లోకి వెళ్తోంది. అలాగని వైసిపి ఇప్పుడు పోరాటం మొదలు పెడదామన్నా… టిడిపి చేస్తుంది కనుక తప్పనిసరి పరిస్థితుల్లో వైసిపి హోదా కోసం కదిలింది అనే భావన ప్రజల్లో వస్తుందేమో అన్న సందేహం వైసీపీని వెంటాడుతోంది.