జగన్‌ ధర్నా చేస్తే ఇస్తారా?

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి , ప్రజలకు పెద్ద షాక్‌ ఇచ్చింది.దేశంలోని ఏ రాష్ర్టానికీ ‘ప్రత్యేక హోదా’ ఇచ్చే ఆలోచన లేదని, ఆ ప్రతిపాదన కూడా ప్రభుత్వం దగ్గర లేదని తేల్చి చెప్పడంతో ఆశలు అడియాసలయ్యాయని చెప్పుకోవచ్చు.

 Ap Won’t Get Any Special Status-TeluguStop.com

ఏ రాష్ర్టానికీ ప్రత్యేక హోదా ఇచ్చే ఆలోచన లేదంటే అందులో ఏపీ కూడా ఉన్నట్లే కదా…! కాని ఏపీ తప్ప మిగతా రాష్ర్టాల గురించి ప్రభుత్వం చెప్పిందని టీడీపీ మంత్రులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.ఇతర రాష్ర్టాలతో ఆంధ్రను పోల్చేందుకు వీలులేదని, కాబట్టి ఏపీకి ప్రత్యేక హోదాను పువ్వుల్లో పెట్టి అందిస్తారని అంటున్నారు.

ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం చెప్పినదానిపై ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు విశ్లేషించుకుంటున్నారు.సినిమా నటుడు శివాజీ అధ్యక్షుడిగా ప్రత్యేక హోదా సాధన కమిటీ ఏర్పడిన వెంటనే కేంద్ర ప్రభుత్వం ‘నో’ అనే ప్రకటన చేయడం విశేషం.

మొన్నీమధ్యనే టీడీపీ పార్లమెంటు సభ్యులు పార్లమెంటు ఆవరణలో ప్రత్యేక హోదా డిమాండ్‌ చేస్తూ ధర్నా చేశారు.కొంతకాలం కిందట జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మీడియా సమావేశం పెట్టి ప్రత్యేక హోదా సాధన కోసం టీడీపీ ఎంపీలు కృషి చేయడంలేదని తిట్టిపోశారు.

వీళ్ల కంటే తెలంగాణ నాయకులు చాలా బెటరని అన్నారు.మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ప్రకటన మీద ఏమంటారో తెలియదు.

ప్రత్యేక హోదా సాధించే సత్తా తమకే ఉందని, సాధించి తీరుతామని ఏపీ కాంగ్రెసు అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అన్నారు.కేంద్ర ప్రభుత్వ ప్రకటనపై టీడీపీ నాయకులకు కోపం రాలేదుగాని వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు.

ఆగస్టు పదో తేదీన ఢిల్లీలో ధర్నా చేస్తానని ప్రకటించారు.ఆయన ధర్నా చేసినంత మాత్రాన ప్రత్యేక హోదా ఇస్తారా? ఇవ్వరు.కాని నిరసన వ్యక్తం చేయకపోతే ప్రజలకు ఏం చెప్పుకుంటారు? టీడీపీ కూడా నోరు మూసుకొని ఊరుకుంటే ప్రజల్లో సర్కారుపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది.మరి వాళ్లేం చేస్తారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube