సర్వేలనే నమ్ముకున్న జగన్ ! అభ్యర్థుల ఎంపిక కు అదే కీలకం ?  

Ys Jagan Depends On Surveys Results-surveys Results,ys Jagan,ysrcp Mla Candidates

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో ఏపీలో రాజకీయ పార్టీలో హడావుడి మరింత పెరిగింది. ఇప్పటికే కొన్ని పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించగా మరికొన్ని పార్టీలు రేపోమాపో అన్నట్టుగా ఉన్నాయి. ఒక పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాను పరిశీలించి ఆయా నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాలని ప్రత్యర్థి పార్టీలు కాచుకు కూర్చున్నాయి..

సర్వేలనే నమ్ముకున్న జగన్ ! అభ్యర్థుల ఎంపిక కు అదే కీలకం ?-YS Jagan Depends On Surveys Results

ఈ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్వేలని నమ్ముకుని ఉంది. ఇప్పటికే ఆ పార్టీ రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ అనేక దఫాలుగా సర్వేలు నిర్వహించి జగన్ కు రిపోర్ట్ అందించాడు. దీంతోపాటు జగన్ మరో రెండు సంస్థలతో సర్వేలు చేయించగా పీకే సర్వేకు దగ్గరగానే ఆ సర్వే ఫలితాలు వచ్చాయట.

ఈ సర్వే లెక్కలు సరిచూసుకుని ఈ నెల 15వ తేదీన అభ్యర్థుల లిస్ట్ ప్రకటించేందుకు జగన్ సిద్ధమవుతున్నాడు. ఈ నెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుండడంతో ఆలస్యం చేయకుండా అభ్యర్థులను ప్రకటించాలని జగన్ చూస్తున్నాడు. అదీకాకుండా టిడిపి నుంచి అసంతృప్తులు బలమైన నేతలు వైసీపీలో చేరుతుండడంతో వారి అభ్యర్థిత్వం కూడా పరిగణలోకి తీసుకుని లిస్ట్ తయారు చేసే పనిలో జగన్ ఉన్నాడు. అలాగే బస్సు యాత్ర ద్వారా పాదయాత్రలో లో తిరగలేని నియోజకవర్గాలను ముందుగా చుట్టిరావాలని ఆ తరువాత ఏపీ మొత్తం బస్సు యాత్ర ద్వారా కార్యకర్తల్లో, ప్రజల్లో కొత్త జోష్ నింపాలని జగన్ చూస్తున్నాడు.

అందుకే అభ్యర్థుల ఎంపికపై ఇప్పుడు సీరియస్ గా దృష్టిపెట్టాడు. ఖచ్చితంగా గెలుస్తారు అనుకున్న వారికే టికెట్లు కేటాయించాలని జగన్ చూస్తున్నాడు.

కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులను రంగంలోకి దించి టీడీపీకి ధీటుగా పోటీ ఇవ్వాలని చూస్తున్నాడు. అదే సమయంలో ఇప్పటివరకు పార్టీ కోసం కష్టపడిన నాయకులకు అన్యాయం చేయకుండా వారికి నచ్చచెప్పి ఎక్కడ అసంతృప్తులు తలెత్తకుండా జాగ్రత్త పడుతున్నాడు. వైసీపీ నాయకుల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఈ సర్వేల ఎఫెక్ట్ తో చాలామంది నియోజకవర్గ ఇంచార్జిలకు మొండిచేయి తప్పదని తెలుస్తోంది..