కరోనా తో కలిసి నడిచేద్దామా ? ఇంకో మార్గం లేనట్టేగా ?

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ ప్రభావం ఎప్పుడు అంతమవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.ఇప్పటికే ఈ వైరస్ మహమ్మారి కారణంగా, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మరణించగా, కోట్లాది మంది ప్రజలు ఈ వైరస్ భయంతో అల్లాడుతున్నారు.

 Andhra Pradesh, Corona Virus, Jagan, Cantonment, Central Medical Professionals,-TeluguStop.com

ఇప్పటికీ ఈ వైరస్ కు విరుగుడు మందు కనిపెట్టే పనిలో ప్రపంచ దేశాలు నిమగ్నం అవ్వగా, మరికొన్ని దేశాలు చేతులెత్తేశాయి.అయితే ఏపీ లో వచ్చిన కేసుల్లో 80 శాతం కేసులు ఎటువంటి వ్యాధి లక్షణాలు కనిపించకుండా, ఆరోగ్యంగా కనిపించే వ్యక్తులకే కరోనా పాజిటివ్ రావడం గమనిస్తే ఈ వైరస్ ప్రభావం ఎంత తీవ్రంగా, ఎన్ని రకాలుగా ఉందో అర్థమవుతుంది.

అంతేకాదు ఈ వైరస్ ఎంత ప్రమాదకరమైనదో అర్థమవుతుంది.ఈ విధంగా ఎటువంటి లక్షణాలు లేని వారికి కరోనా సోకడం, వారిని గుర్తించడం అత్యంత కష్టమైన పని.

ముఖ్యంగా కరోనా టెస్టులు ఎవరికి చేయాలి ? ఎవరికి అవసరం లేదు అనే విషయం తెలుసుకోవడం చాలా కష్టమైన పని.ఇదే విషయాన్ని కేంద్ర బృందం ముందు రాష్ట్ర నిపుణుల బృందం కూడా సందేహాన్ని లేవనెత్తింది.వారు కూడా సరైన సూచనలు చేయలేకపోవడంతో దీనిని ఏ విధంగా కట్టడి చేయాలి అనేది పెద్ద చిక్కుగా మారింది.వాస్తవంగా చూసుకుంటే.కరోనా టెస్ట్ లు పరంగా చూసుకుంటే ఏపీ దేశంలోనే నెంబర్ వన్ గా ఉంది.ఇంత వరకు బాగానే ఉన్నా, ఇప్పుడు టెస్ట్ లు ఎవరికి చేసి ఫలితం రాబట్టాలి అనే విషయంలో కేంద్ర వైద్య నిపుణుల బృందం కూడా ప్రభుత్వానికి సరైన సూచనలు సలహాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది.

దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కంటోన్మెంట్లో ఉండే వారికి మాత్రమే ఎక్కువగా పరీక్షలు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.

Telugu Andhra Pradesh, Centralmedical, Corona, Donald Trump, Jagan, Narendra Mod

ఇక కరోనా ను అరికట్టేందుకు ప్రత్యేక మార్గాలు ఏవి లేవు.వ్యాక్సిన్ వచ్చేవరకు దీంతో కలిసి సహజీవనం చేయడం తప్పని పరిస్థితి.ఇదే విషయాన్ని కొద్ది రోజుల క్రితం ఏపీ సీఎం జగన్ కూడా చెప్పారు.

అయితే జగన్ వ్యాఖ్యలను అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు.ఇక ఆ తరువాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ ఆరోగ్య సంస్థ, తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీ, ఇలా అందరూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో ఇప్పుడిప్పుడే జగన్ వ్యాఖ్యలు జనాలు అర్ధం చేసుకుంటున్నారు.

ప్రస్తుతం లాక్ డౌన్ నిబంధన విధించినా, ఎక్కువకాలం దాన్ని కొనసాగించలేని పరిస్థితి ఉంది.

ఇక జనాలు కూడా స్వీయ నియంత్రణ పాటిస్తూ, జనాల్లో తిరగకుండా సామాజిక దూరం పాటిస్తూ, వ్యక్తిగత శుభ్రత కు అధిక ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా మాత్రమే ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు అవకాశం ఉంటుంది.

దాదాపు వాక్సిన్ వచ్చేందుకు ఒక సంవత్సర కాలం పట్టే అవకాశం ఉండటంతో దీనిపై అవగాహన పెంచుకుని కరోనా తో కలిసి జీవించేందుకు మానసికంగా సిద్ధం అవ్వాల్సిన పరిస్థితి నెలకొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube