పులివెందుల‌కు జ‌గ‌న్ గుడ్ బై...ఆ జిల్లా నుంచే అసెంబ్లీకి పోటీ..!

వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పులివెందుల‌కు గుడ్ బై చెప్ప‌నున్నారా ? నాలుగు ద‌శాబ్దాలుగా వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట‌గా ఉంటోన్న పులివెందుల నుంచి త‌న ఫ్యామిలీ స‌భ్యుల‌ను రంగంలోకి దింపి పార్టీకి ఊపు తెచ్చేందుకు జ‌గ‌న్ మ‌రో జిల్లా నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారా ? అంటే అవున‌నే సంకేతాలు వైసీపీ నుంచి వినిపిస్తున్నాయి.క‌డ‌ప జిల్లాలోని పులివెందుల‌తో పాటు ఈ జిల్లాలో ఆరేడు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీకి, జ‌గ‌న్ ఫ్యామిలీకి స్థిర‌మైన ఓటు బ్యాంకు ఉంది.ఇక్క‌డ నుంచి వైసీపీ త‌ర‌పున ఎవ‌రు పోటీ చేసినా గెలిచేందుకు సులువుగా ఛాన్సులు ఉంటాయి.

 Ys Jagan Contesting From Prakasam District-TeluguStop.com

గ‌తంలోనే జ‌గ‌న్ తండ్రి వైఎస్‌, త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మితో పాటు ఇప్పుడు జ‌గ‌న్ వీళ్లంతా పులివెందుల నుంచే ఎమ్మెల్యేలుగా గెలిచారు.క‌మ‌లాపురం నుంచి మేన‌మామ ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి ఎమ్మెల్యే, ఇక రాయ‌చోటి నుంచి జ‌గ‌న్ బెస్ట్‌ఫ్రెండ్శ్రీకాంత్‌రెడ్డి ఉన్నారు.జ‌మ్మ‌ల‌మ‌డుగుతో పాటు క‌డ‌ప నియోజ‌క‌వ‌ర్గంలోనూ వైఎస్ ఫ్యామిలీకి 20 శాతం స్థిర‌మైన ఓటు బ్యాంకు ఉంది.ఇక్క‌డ వైఎస్ ఫ్యామిలీ నుంచి ఎవ‌రు నిల‌బ‌డినా సులువుగానే గెలుస్తారు.

జ‌గ‌న్‌తో పాటు జ‌గ‌న్ సోద‌రుడు అవినాష్‌రెడ్డి, మేన‌మామ ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి, రేపు వైఎస్‌.వివేకానంద‌రెడ్డితో పాటు జ‌గ‌న్ స‌న్నిహితులు అయిన శ్రీకాంత్‌రెడ్డి లాంటి వాళ్లు అంద‌రూ క‌డ‌ప జిల్లా నుంచే పోటీ చేస్తే ఆ ఊపు కేవ‌లం ఈ జిల్లా వ‌ర‌కే ఉంటుంద‌ని జ‌గ‌న్ టీం డిసైడ్ అయ్యింది.

ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో పులివెందుల నుంచి త‌న బాబాయ్ వైఎస్‌.వివేకాను పోటీ చేయించి తాను రాజ‌ధానికి ద‌గ్గ‌ర‌గా ఉన్న ప్ర‌కాశం జిల్లా నుంచి పోటీ చేసే అంశంపై జ‌గ‌న్ ఆలోచ‌న చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

ఒంగోలు ఎంపీగా ఇప్ప‌టికే జ‌గ‌న్ బాబాయ్ వైవి.సుబ్బారెడ్డి ఉన్నారు.వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి సుబ్బారెడ్డి లేదా జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిల పోటీ చేసే ఛాన్సులు ఉన్నాయి.ఇక జ‌గ‌న్ ఈ జిల్లాలో అసెంబ్లీకి పోటీ చేయాల‌నుకుంటే ప‌శ్చిమ ప్ర‌కాశం జిల్లాలోని రెడ్డి సామాజిక‌వ‌ర్గం బ‌లంగా ఉండ‌డంతో పాటు వైసీపీ బ‌లంగా ఉన్న గిద్ద‌లూరు లేదా మార్కాపురం నుంచి పోటీ చేయ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది.

ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైఎస్ ఉన్న‌ప్పుడు కాంగ్రెస్ ఆ త‌ర్వాత వైసీపీ చాలా బ‌లంగా ఉన్నాయి.గ‌త ఎన్నిక‌ల్లో ఈ రెండు సీట్ల‌లోనూ వైసీపీ అభ్య‌ర్థులు భారీ మెజార్టీతో గెలిచారు.

ఆ త‌ర్వాత ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ నేప‌థ్యంలో గిద్ద‌లూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి టీడీపీలోకి జంప్ చేసేశారు.మార్కాపురం నుంచి జంకె వెంక‌ట‌రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు.ఈ రెండు సీట్లూ వైసీపీకి బ‌ల‌మైన‌వేన‌.ఇంకా చెప్పాలంటే ఒంగోలులో ఎంపీ సుబ్బారెడ్డితో పొస‌గ‌ని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను మార్కాపురం నుంచి పోటీ చేస్తాన‌ని… త‌న‌కు ఆ సీటు ఇవ్వాల‌ని జ‌గ‌న్‌కు విన్న‌వించుకున్నా జ‌గ‌న్ అందుకు ఒప్పుకోలేదు.

దీనిని బ‌ట్టి ఈ రెండు సీట్లు వైసీపీకి ఎంత స్ట్రాంగో తెలుస్తోంది.

ఎలాగు క‌డ‌ప‌లో వైసీపీ అల‌వోక‌గా గెలిచే అవ‌కాశం ఉన్నందున అక్క‌డ కాకుండా రాజ‌ధాని ఏరియాకు ద‌గ్గ‌ర‌గా ఉన్న ప్ర‌కాశం జిల్లా నుంచి పోటీ చేస్తే ఆ ఎఫెక్ట్ ఇటు నెల్లూరుతో పాటు అటు గుంటూరు జిల్లాల మీద బ‌లంగా ఉంటుంద‌ని… అక్క‌డ వైసీపీకి మాంచి జోష్ వ‌స్తుంద‌న్న‌దే జ‌గ‌న్ ప్లాన్‌గా తెలుస్తోంది.

ప్ర‌కాశం జిల్లాలో పోటీ చేస్తే దాని ప్ర‌భావం ఎలా ఉంటుంద‌నేదానిపై ఓ రిపోర్ట్ సిద్ధం చేయించాల‌ని పార్టీ సీనియ‌ర్ నేత‌ల‌కు ఆదేశించిన‌ట్లు తెలుస్తుంది.పార్టీ సీనియ‌ర్లు మీడియాతో చెప్తున్న దాన్ని బ‌ట్టి చూస్తే ఈసారి పులివెందుల‌కు జ‌గ‌న్ దూరంగా ఉండే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని తెలుస్తోంది.

చూడాలి మ‌రి పార్టీ గెలుపు కోసం జ‌గ‌న్ కొత్త ప్ర‌యోగానికి తెర‌దీస్తాడో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube