ఆ విషయంలో మొహమాటం వదిలేసిన జగన్ !

ఏపీలోనూ… ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేస్తుండడంతో … రాజకీయ పార్టీలు హడావుడి పడుతున్నాయి.ఇక్కడ ముక్కోణపు పోటీ ఉండడంతో గెలుపు కోసం ఇప్పటి నుంచే టీడీపీ , జనసేన , వైసీపీ పార్టీలు పావులు కదుపుతున్నాయి.

 Ys Jagan Changes Constituency Incharges 3-TeluguStop.com

టీడీపీ వచ్చే ఎన్నికల్లో ఎంత ఖర్చుపెట్టయినా గెలవాలని చూస్తుంటే జనసేన మాత్రం రెండు మూడు జిల్లాల్లో ఫోకస్ బాగా పెట్టి అక్కడ సాధ్యమైనంతవరకు అన్ని సీట్లను తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది.అందుకే ఆ పార్టీ అధినేత పవన్ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో తరుచు సభలు… సమావేశాలు నిర్వహిస్తూ… హడావుడి చేస్తున్నాడు.

ఇక వైసీపీ విషయానికి వస్తే… ఆ పార్టీ అధినేత జగన్ ఒక పక్క పాదయాత్ర చేస్తూనే.మరో వైపు పార్టీ లో ప్రక్షాళన మొదలు పెట్టాడు.

ఈ సారి ఎన్నికల్లో ఎలా అయినా గెలవాలనే కసి జగన్ లో స్పష్టంగా కనిపిస్తోంది.అందుకే మొహమాటాలు కూడా పక్కన పెట్టి మరీ ముందుకు వెళ్తున్నాడు.జిల్లాల వారీగా నివేదికలు ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్న జగన్‌.గెలుపు గుర్రాలను, అధికార పార్టీ నేతలను ఓడించగలిగే సత్తా.అన్ని విధాలుగా ఉన్న వారిని మాత్రమే ఎంపిక చేసుకుంటున్నాడు.ఈ క్రమంలోనే ఇప్పటి వరకు పార్టీలో సేవ చేసిన, అంకిత భావంతో వ్యవహరించిన నాయకులను కూడా జగన్ పక్కన పెట్టారు ఆయా నియోజకవర్గాల్లో ఆర్థికంగా, సామాజికంగా కూడా బలమైన నాయకులను రంగంలోకి దింపుతున్నారు.

పాదయాత్ర ద్వారా ఇప్పటికే ఏ నియోజక వర్గంలో ఏంటి పరిస్థితి అని ఒక అంచనాకు వచ్చిన జగన్ నిజయోజక వర్గ కన్వీనర్లను మొహమాటం లేకుండా మార్చేస్తున్నారు.ఈ కోవలో ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకుని ఉన్నవారు… జగన్ కు అత్యంత సన్నిహితులను ఇలా ఎంత గొప్ప నాయకుడు అన్న విషయం పక్కన పెట్టి ఖచ్చితంగా గెలుస్తాడా లేదా అనే ఒకే ఒక్క పాయింట్ ఆధారంగానే జగన్ సీటు కన్ఫర్మ్ చేస్తున్నాడు.ఇప్పటికే అనేక సర్వేలు చేయించిన జగన్ …ఆ నివేదికల ఆధారంగా మార్పు చేర్పులు చేస్తున్నాడు.ఇక జనసేన అధినేత తాజాగా చేయించిన సర్వేలోనూ… వైసీపీ ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో చాపకింద నీరు లా బలపడుతూ వస్తోందని తేలిందట.

ఇక జగన్ పాదయాత్ర ముగింపు దశకు వచ్చేస్తుండడంతో పూర్తి స్థాయి సమయం అభ్యర్థుల ఎంపికపైనే జగన్ పెట్టబోతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube