వైసీపీ గెలవాలి .. అందుకే మీరు తప్పుకోవాలి ! మరీ ఈ రేంజ్ లోనా ..?  

కొద్ది రోజులుగా వైసీపీలో జరుగుతున్న వరుస పరిణామాలు ఆ పార్టీ నేతలకు కంటిమీద కునుకు పడనీయడంలేదు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఓ సరికొత్త సర్వే రిపోర్ట్ దగ్గర పెట్టుకున్న జగన్ దానికి అనుగుణంగా ఎటువంటి మొహమాటాలకు పోకుండా నియోజకవర్గ ఇంచార్జిలను మార్చేస్తున్నారు. ఈ మార్పు ఏ స్థాయిలో ఉంది అంటే పార్టీ పెట్టినప్పటినుంచే కాదు జగన్ తండ్రి రాజశేఖర రెడ్డి దగ్గర కూడా అత్యంత చనువుగా ఉండి ప్రస్తుత వైసీపీ కోసం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని పార్టీ కోసం పని చేస్తున్న వారిని కూడా పక్కన పెట్టేసే రేంజ్ లో మార్పులు సాగుతున్నాయి.

Ys Jagan Changes Constituency Incharges-

Ys Jagan Changes Constituency Incharges

పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్ టీమ్‌తో పాటు.. పార్టీ అధిష్టానం చేసిన సర్వేల ఆధారంగా నియోజకవర్గ ఇన్‌చార్జిలను మర్చాలని పార్టీ అధినేత జగన్ నిర్ణయించారు. అందులో భాగంగా ఇప్పటికే చాలా వరకూ మార్పులు జరిగిపోవడంతో మిగిలిన నియోజకవర్గాల ఇన్‌చార్జిలు ఆందోళన చెందుతున్నారు. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో కొంతమంది నియోజకవర్గ ఇన్‌చార్జిలను మార్చనుంది వైసీపీ అధిష్టానం. ఇన్‌చార్జిల మార్పు ప్రక్రియను కృష్ణాజిల్లా నుంచే ప్రారంభించిన జగన్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వంగవీటి రాధాకృష్ణను తప్పించి మల్లాది విష్ణుకి సీటు అప్పగించారు. తూర్పు నియోజకవర్గం ఇన్‌చార్జిగా ఉన్న యలమంచిలి రవిని కూడా తప్పించాలని చూస్తున్నారు. గుంటూరు జిల్లాలో చిలకలూరిపేట నియోజకవర్గం ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్‌ను మార్చి విడతల రజినికి బాధ్యలు అప్పగించారు.

Ys Jagan Changes Constituency Incharges-

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇన్‌చార్జి లేళ్ల అప్పిరెడ్డిని తప్పించి ఏసురత్నంకు ఆ సీటు అప్పగించిన ఆలోచనలో ఉన్నాడు జగన్. అలాగే శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఇన్‌చార్జి సర్దు రామారావును తప్పించి పిరియా సాయిరాజ్‌కు అప్పగించారు. పలాసలో వజ్జ బాబురావును తప్పించి సిదిరి అప్పలరాజుకు అప్పగించడంతో ప్రస్తుత ఇన్‌చార్జి బాబురావు అసంతృప్తితో టీడీపీలో చేరారు. అలాగే, తూర్పుగోదావరి జిల్లాలో పెద్దాపురం ఇన్‌చార్జిగా ఉన్న తోట సుబ్బారావు స్థానంలో దవులూరి దొరబాబును తెరపైకి తేవడంతో తోట వర్గం రగిలిపోతుంది. ఇక జగ్గంపేటలో ముత్యాల శ్రీనును తప్పించి జ్యోతుల చంటిబాబుకు ఇచ్చారు.

వీటితోపాటు జిల్లాలోని వేమూరు, తాడికొండ, పెదకూరపాడు నియోజకవర్గాల్లో ఇన్‌చార్జిలను మార్చే ప్రకాశం జిల్లాలోనూ భారీ మార్పులకు వైసీపీ అధినేత జగన్ సిద్ధమయ్యారు. దర్శి నియోజకవర్గం బాధ్యతలను ప్రస్తుతం ఇన్‌చార్జి బాదం మాధవరెడ్డి నుంచి తప్పించి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డికి అప్పగించనున్నారు. పర్చూరు ఇన్‌చార్జి రాంబాబును తప్పించి.. ఆ సీటును గొట్టిపాటి భరత్‌కు ఇవ్వనున్నారు. అద్దంకి ఇన్‌చార్జి బాచిన చెంచు గరటయ్యను కాదని… ఆ సీటును గుంటూరు జిల్లా పెదకూరపాడుకు చెందిన వ్యాపారవేత్తకు అప్పగించాలని చూస్తున్నారు.