జగన్ ఆ విధంగా ముందుకు వెళ్తున్నాడా ?  

Ys Jagan Changed His Speech Style-tdp,ys Jagan Speech Style,ysrcp Schemes,జగన్

 • వైసీపీ అదిఎంత జగన్ లో చాలా మార్పు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో కనిపించినాథ్ దూకుడు ఇప్పుడు కనిపించలేదు.

 • జగన్ ఆ విధంగా ముందుకు వెళ్తున్నాడా ? -YS Jagan Changed His Speech Style

 • 2014 ఎన్నికల్లో మనమే తప్పక గెలుస్తాం అనే ధీమా జగన్ లో ఎక్కువ కనిపించింది. అదే ధీమాతో ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థుల మీద దుమ్మెత్తిపోయ్యడం, వీరావేశంగా ప్రసంగాలు చేస్తూ, అనేక ప్రసంగాలు చేసాడు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.

 • జగన్ లో అప్పట్లో ఉన్న ఆవేశం ఇప్పుడు కనిపించడంలేదు. ఇప్పుడు జగన్ లో కనిపించేది అంతా ఆలోచనే.

 • ప్రస్తుతం జగన్ ప్రసంగాల్లో కనిపించేది అంతా ఎన్నికల్లో విజయం సాధిస్తే ఏమి చేయబోతున్నాము , ఏమేమి చేస్తాము అనే విషయాలనే చెబుతున్నాడు తప్ప కాంట్రవర్సీ స్టేట్ మెంట్స్ లేవు.

  ఎప్పుడూ లేనిది జగన్ లో ఇంత మార్పు ఎందుకు కనిపిస్తుంది ? అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది.

 • గత ఎన్నికల ఫలితాలే జగన్ ఆలోచనలను, వ్యవహార శైలిని మార్చేశాయా, వివాదస్పద వ్యాఖ్యలే గత ఎన్నికల్లో ఓట్లకు గండకొట్టాయా అన్న ఆలోచనలో ఉన్న జగన్ ఇప్పుడు ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. అందుకే తన ప్రసంగాల్లో పథకాల ప్రస్తావన తెస్తున్నాడు తప్ప ఎక్కడా విమర్శల జోలికి వెళ్లడంలేదు.

 • ముఖ్యంగా నంద్యాల ఉప ఎన్నికల సమయంలో జగన్ చేసిన ప్రసంగం కొంత వివాదాస్పదం అవ్వడంతో ఈ విధంగా టర్న్ తీసుకున్నట్టు అర్ధం అవుతోంది.

  YS Jagan Changed His Speech Style-Tdp Ys Style Ysrcp Schemes జగన్

  నంద్యాల ఉప ఎన్నికల సమయంలో చంద్రబాబు తల నరకాలి అని, చెప్పులతో కొట్టాలంటూ జగన్ చేసిన ప్రసంగాన్ని టీడీపీ తనకు అనుకూలంగా మార్చుకుంది. ఆ వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా నంద్యాల ఉప ఎన్నికల్లో జగన్ పార్టీ దారుణమైన ఓటమిని చూడాల్సి వచ్చింది.

 • పాదయాత్ర తరువాత జగన్ వైఖరిలో మార్పు బాగా కనిపిస్తోంది. తనకు ఒక్క అవకాశం ఇస్తే చాలు మార్పు తీసుకొస్తానని చెబుతున్నారు.

 • ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంత సమస్యలను ఎప్పటికప్పుడు ప్రస్తావిస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు.