జగన్ కొత్తగా మాట్లాడుతున్నాడా ! ప్రాధేయపడుతున్నాడా ?

ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ కి రాజకీయ పరిస్థితులు ఏవీ కలిసిరావడం లేదు.ఎండనకా .

 Ys Jagan Changed He Asks Blessings From People-TeluguStop.com

వాననకా పాదయాత్ర చేస్తూ.జనాల్లో సానుభూతి పొంది తద్వారా రాజకీయ చక్రం తిప్పాలని చూస్తున్నాడు.

అయితే అది అనుకున్నంత ఈజీ కాదని ఇప్పుడిప్పుడే ఆయనకు తెలిసొస్తుంది.తాజాగా విడుదలైన ఓ సర్వే ఫలితాలు టీడీపీకి అనుకూలంగా ఉండడంతో జగన్ లో అసహనం మరింత పెరిగినట్టు తెలుస్తోంది.

పాదయాత్ర ద్వారా ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న జగన్ కి ప్రస్తుత పరిస్థితులు ఏవీ కలిసిరావడంలేదు.జిల్లాలో పాదయాత్ర మూడో రోజే.చంద్రబాబుపై వ్యక్తిగతంగా తిట్లుపురాణం మొదలుపెట్టాడు.ఏదైనా బావి చూసుకుని దూకి చావాలని.చంద్రబాబుకు శాపనార్థాలు కూడా పెట్టేసాడు.జగన్ ఆవేశం చూసి ఆ పార్టీ కార్యకర్తలు చప్పట్లు కొట్టినా.

జగన్ ఇంతగా అసహనానికి గురవడం ఏమిటన్న చర్చ ఆ పార్టీలో ప్రారంభమయింది.వివిధ సర్వేల్లో వెల్లడవుతున్న ఫలితాలే జగన్ అసహనానికి కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

చంద్రబాబు మీద ఎన్ని ఆరోపణలు చేస్తున్నా.ఎంత తీవ్రంగా విమర్శిస్తున్నా.ప్రజల ఆలోచనల్లో పెద్దగా మార్పు ఉండటం లేదన్న అభిప్రాయం జగన్ కి ఉంది.పి.గన్నవరం పాదయాత్రలో ప్రసంగించిన జగన్.“తనను ఆశీర్వదించమని ప్రాథేయపడుతున్నానన్నారు.”.ప్రాధేయపడుతున్నాననే మాట జగన్ నోటి వెంట రాగానే అందరూ అవాక్కయ్యారు.

జగన్ ఎప్పుడూ ఇలా మాట్లాడాడే .? అసలు ఇది జగన్ నైజం కాదని చర్చ సాగింది.తమ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఆశ సన్నగిల్లడంతోనే ప్రజలను ఒక్క చాన్స్ అని బతిమాలుతున్నట్లు ప్రసంగిస్తున్నాడని విమర్శలు వినిపిస్తున్నాయి.

కొద్ది రోజుల క్రితం లగడపాటి రాజగోపాల్‌కు చెందిన ఆర్జీస్ ఫ్లాష్ టీం.చేసిన సర్వే ఓ చానల్‌లో ప్రసారం అయింది.దాంతో.

వైసీపీ పరిస్థితి దిగజారిపోతుందని తేలింది.పాదయాత్ర చేసిన జిల్లాల్లోనూ మెరుగైన ఫలితాలు రావని తేలింది.

ఈ సర్వే జగన్‌పై ప్రభావం చూపించి ఉంటుందని అందుకే ఆయన ఇంతగా ప్రాధేయపడుతున్నట్టు జనాల్లో చర్చ మొదలయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube