జ‌గ‌న్‌ది రివ‌ర్స్ టెండ‌రింగ్‌.. బాబుది రివ‌ర్స్ ట్రెండ్‌..!

తాజా రాజ‌కీయ ప‌రిణామాల‌పై రాష్ట్రంలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.అదేంటంటే.

 Difference Between Ys Jagan And Chandrababu Politics,jagan,jagan Mohan Reddy,and-TeluguStop.com

రివ‌ర్స్ విష‌యంలోనూ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత, టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ప్ర‌బుత్వాధినేత జ‌గ‌న్ ఇద్ద‌రూ రివ‌ర్స్‌లో వెళ్తున్నార‌నే! విష‌యంలోకి వెళ్తే.సీఎంగా జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తూనే వంద కోట్లు దాటి ఖ‌ర్చ‌య్యే అన్ని ప్రాజెక్టులకు రివ‌ర్స్ టెండ‌రింగ్ నిర్వ‌హించి.

అతి త‌క్కువ‌కు ఎవ‌రు ప‌నిచేయ‌గ‌లిగితే.వారికి ఆయా ప‌నులు అప్ప‌గిస్తాన‌ని ప్ర‌క‌టించారు.

అదేస‌మ‌యంలో అవినీతికి తావులేకుండా కూడా చేస్తాన‌ని చెప్పారు.

ఇక‌, దీనివ‌ల్ల లాభాల‌ను కూడా వివ‌రించారు.

ప్ర‌జాద‌నం వృథా కాద‌ని, పైగా నిజాయితీతో కూడిన ప్ర‌జాసేవ చేయాల‌నే వారే కాంట్రాక్ట‌ర్లుగా ముందుకు వ‌స్తార‌ని జ‌గ‌న్ ఉద్ఘాటించారు.సో. జ‌గ‌న్‌ది రివ‌ర్స్ టెండ‌రింగ్ .దీనివ‌ల్ల‌.ప్ర‌జ‌ల‌కు అంతో ఇంతో మేలు జ‌ర‌గ‌డం ఖాయం.ఇక‌, చంద్ర‌బాబు రివ‌ర్స్ ట్రెండ్ గురించి చూస్తే.తాను త‌నకు అనుకూలంగా ఉంటే ఒకలా వ్య‌వ‌హ‌రించ‌డం లేక‌పోతే.రివ‌ర్స్‌గా వ్య‌వ‌హ‌రించి .కులాల‌ను అడ్డు పెట్టుకోవ‌డం ఈ బాప‌తు కింద‌కు వ‌స్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఉదాహ‌ర‌ణ‌కు విశాఖ ఎల్జీ పాలిమ‌ర్స్‌లో గ్యాస్ లీక్‌ ప్ర‌మాదం జ‌రిగి పాతిక మంది మృతి చెందారు.

ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన చంద్ర‌బాబు పాలిమ‌ర్స్ నిర్వాహ‌కుల‌ను ఎందుకు అరెస్టు చేయ‌లేద‌న్నారు.స‌రే మంచిదే.అనుకున్నారు అంద‌రూ.ఇప్పుడు విజ‌య‌వాడ స్వ‌ర్ణ‌ప్యాలెస్‌లో కొవిడ్ కేర్ సెంట‌ర్‌లో అగ్ని ప్ర‌మాదం జ‌రిగి ప‌ది మంది చ‌నిపోయారు.

దీంతో ప్ర‌భుత్వం.కొవిడ్ సెంట‌ర్ నిర్వాహ‌కుడు డాక్ట‌ర్ రమేశ్‌ను అరెస్టు చేసేందుకు ఉత్త‌ర్వులు ఇచ్చింది.

దీంతో చంద్ర‌బాబు ఠాట్‌.ర‌మేష్‌ను ఎలా అరెస్టు చేస్తారంటూ.

అగ్గి మీద గుగ్గిల‌మ‌య్యారు.

Telugu Andhra Pradesh, Chandra Babu, Differenceys, Jagan, Reverse, Reverse Trend

విశాఖ ఘ‌ట‌న‌లో తాను చెప్పిన‌ట్టు జ‌ర‌గాల‌న్న చంద్ర‌బాబు విజ‌య‌వాడ విష‌యానికి వ‌స్తే.మాత్రం రివ‌ర్స్ అయ్యారు.ఇక‌, కులం రంగులు పుల‌మ‌డంలోనూ ఆయ‌న త‌ర్వాతే అంటున్నారు రాజ‌కీయ‌ ప‌రిశీల‌కులు.

ఈ ప‌రిణామాల‌తో జ‌గ‌న్ రివ‌ర్స్ టెండ‌రింగ్ ద్వారా ముందుకు వెళ్తుంటే.చంద్ర‌బాబు మాత్రం రివ‌ర్స్ ట్రెండ్‌తో ముందుకు సాగుతున్నార‌ని చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube