బాబుకున్న ఆలోచ‌న జ‌గ‌న్‌కు కొర‌వ‌డిందే.. ఇది.. క‌ష్ట‌మేనా..?

ఏపీ అధికార పార్టీ వైసీపీలో కీల‌క‌మైన చ‌ర్చ‌సాగుతోంది.తాజాగా వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం.

 Jagan Dont Have That Much Of Knowledge Like Chandrababu,andhra Pradesh,chandra B-TeluguStop.com

కీల‌క‌మైన ఓటు బ్యాంకును దూరం చేస్తుంద‌నే అంశం.పార్టీలో క‌ల‌వ‌ర‌పెడుతోంది.

కేంద్రం తీసుకువ‌చ్చిన వ్య‌వ‌సాయ బిల్లుకు ఆమోదం తెలిపి.ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ మ‌న‌సు దోచుకునే ప్ర‌య‌త్నం చేసిన జ‌గ‌న్‌.

అదే స‌మ‌యంలో రాష్ట్రంలో కీల‌క‌మైన రైతుల ఓటు బ్యాంకుకు దూరం అవుతున్నారేమోన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.రాష్ట్రంలో రైతులు కీల‌క ఓటు బ్యాంకు అన‌డంలో సందేహం లేదు.

అందుకే ప్ర‌తి ప్ర‌భుత్వ‌మూ కూడా రాజ‌కీయంగా రైతుల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు మార్గాలు వెతుక్కుంటాయి.

ఈ క్ర‌మంలో ఉచిత విద్యుత్ వంటి ప‌థ‌కాలు, రైతు రుణ మాఫీ వంటి సంక్షేమాలు రైతుల ఓటు బ్యాంకును ప్ర‌భావితం చేయ‌డంతోపాటు ఆయా పార్టీల‌ను అధికారంలోకి తీసుకువ‌చ్చిన సంఘ‌ట‌న‌లు మ‌న‌కు తెలిసిందే.

అయితే, ఇప్పుడు కేంద్రం తీసుకువ‌చ్చిన‌. వ్య‌వ‌సాయబిల్లు రైతుల‌కు ప్రాణ‌సంక‌ట‌మ‌ని, వారికి మ‌ద్ద‌తు ధ‌ర ల‌భించే విష‌యంలో కార్పొరేట్ శ‌క్తులు అన్నీ.మ‌రింత విజృంభించ‌డం ఖాయ‌మ‌ని.రైతుల‌కు న్యాయం చేసే విష‌యంలో ప్ర‌భుత్వాల జోక్యం త‌గ్గుతుంద‌ని.

ఈ బిల్లుపై విప‌క్షాలు తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నాయి.అంతేకాదు.

కేంద్ర మంత్రి కూడా ఒక‌రు రిజైన్ చేశారు.

Telugu Andhra Pradesh, Chandra Babu, Chandrababu, Farmers, Knowledge, Narendra M

ఇవ‌న్నీ ఇలా ఉంటే.రాష్ట్రం విష‌యానికి వ‌స్తే.రైతులు ఇక్క‌డ‌.

ఇప్ప‌టికే క‌రెంటు మీట‌ర్ల విష‌యంలో జ‌గ‌న్‌పై ఒకింత ఆగ్ర‌హంతో ఉన్నారు.ఈ స‌మ‌యంలో కేంద్రం తీసుకువ‌చ్చిన బిల్లును మ‌రింత‌గా వ్య‌తిరేకించే అవ‌కాశం ఉంది.

ఈ నేప‌థ్యంలో కొన్నాళ్లుగా కేంద్రంలోని బీజేపీతో ట‌చ్‌లో ఉంటూ వ‌స్తున్న చంద్ర‌బాబు కూడా ఈ బిల్లు విష‌యంలో మాత్రం త‌న మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌లేదు.పైగా త‌న ఎంపీల‌తో రాజ్య‌స‌భ‌లోనే విమ‌ర్శించారు.

కానీ, జ‌గ‌న్ ఈ బిల్లును కొనియాడ‌డంతోపాటు.మ‌ద్ద‌తు కూడా ప్ర‌క‌టించారు.

ఇది రాష్ట్రంలోని రైతాంగానికి ఆగ్ర‌హం తెప్పించ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు వైసీపీ నాయ‌కులు.కొంద‌రు.దీనిని ప్ర‌తిప‌క్షాలు ప్ర‌చారం చేస్తాయ‌ని కూడా చెబుతున్నారు.రైతుల్లో వ్య‌తిరేక‌త‌ను చంద్ర‌బాబు ముందుగానే గుర్తించి.

జంకార‌ని, కానీ, జ‌గ‌న్ మాత్రం దూకుడు నిర్ణ‌యం తీసుకున్నార‌ని, ఇది ఎఫెక్ట్ అయితే.ప్ర‌మాద‌మేన‌ని అంటున్నారు.

మొత్తానికి జ‌గ‌న్ తీసుకున్న తాజా నిర్ణ‌యం రాజ‌కీయంగా ఎలాంటి ప్ర‌భావం చూపుతుందోన‌ని అంటున్నారు.మ‌రి చూడాలి ఏం జ‌రుగుతుందో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube