కేంద్రం చేసిన పాపాలు జ‌గ‌న్‌ను వెంటాడుతున్నాయా..?

ఇటీవ‌ల కాలంలో ఏపీ సీఎం జ‌గ‌న్ తీసుకుంటున్న కొన్ని నిర్ణ‌యాలు తీవ్ర వివాదానికి కార‌ణ‌మవుతున్నా యి.జ‌గ‌న్‌కు ఏమాత్రం మాన‌వ‌త్వం లేదా? అనే వ్యాఖ్య‌లు వినిపించే స్థాయి వ‌ర‌కు చేరుకుంటున్నాయి.ఇక‌, జ‌గ‌న్ వ్య‌తిరేక మీడియా అయితే.వీటికి మ‌రింత గా మ‌సాలా అద్ది.ప్ర‌చారం చేస్తోంది.దీంతో ప్ర‌జ‌ల్లో నిజానిజాలు తెలియ‌క‌.

 Central Govt New Rules On Ration Card Holders, Andhra Pradesh,chief Minister Jag-TeluguStop.com

జ‌గ‌న్‌పై ఆడిపోసుకునే ప‌రిస్థితి వ‌స్తోంద‌ని అంటున్నారు వైసీపీ నాయ‌కులు.దీంతో జ‌గ‌న్ నిర్ణ‌యాలు.

వ‌స్తున్న వ్య‌తిరేక‌త‌పై తీవ్ర‌స్థాయిలో చ‌ర్చ సాగుతోంది.ఇటీవ‌ల కాలంలో జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు.

ఒక‌టి.రైతులు వినియోగించే విద్యుత్‌కు మీట‌ర్లు పెట్ట‌డం.

దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు టీడీపీ స‌హా ప్ర‌తిప‌క్ష నేత‌లు.కానీ, వాస్త‌వానికి ఇది కేంద్రం చెప్పింది క‌నుక‌నే తాము చేస్తున్నామ‌ని జ‌గ‌న్ చెప్పుకొచ్చారు.ఇది నిజ‌మే! కేంద్రం ఈ ష‌రతు పెట్టింది.ఇలా అమ‌లు చేస్తేనే రాష్ట్రానికి అప్పులు ఇచ్చేలా ఒప్పుకొంటామ‌ని పేర్కొంది.

కానీ, ఈ విష‌యం రైతుల్లోకి వెళ్లేలోపే జ‌గ‌న్‌పై వ్య‌తిరేకత పెరిగేలా ప్ర‌తిప‌క్షాలు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించాయి.ఇక‌, ఇటీవ‌ల వ‌ర్షాలు వ‌ర‌ద‌ల‌తో అతలాకుత‌ల‌మైన ప్రాంతాల్లో ప‌రిహారం ఇచ్చేందుకు ఆయా గ్రామాలు.

క‌నీసం వారం రోజులు వ‌ర‌ద‌లో ఉండాల‌ని ప్ర‌భుత్వం నిబంధ‌న విధించింది.
ఇంకేముంది.

ఏకంగా చంద్ర‌బాబు కూడా రంగంలోకి దిగిపోయి.ఈ ప్ర‌భుత్వానికి మాన‌వ‌త్వం లేదు! అంటూ ఆదిపోసుకున్నారు.

ఇక‌, ఆయ‌న అనుకూల మీడియా జ‌గ‌న్‌పై నిప్పులు చెరిగేసింది.తీరా చూస్తే.

ఇది కేంద్ర ప్ర‌భుత్వ నిబంధ‌న‌.వ‌ర్షాలు వ‌ర‌ద‌లు వ‌చ్చిన ప్రాంతాల్లో వారం రోజులు ఆ ప్ర‌భావం ఉంటే త‌ప్ప కేంద్రం ఆర్థికంగా సాయం అందించ‌దు.

కానీ, ఈ విష‌యం ప్ర‌భుత్వం చెప్పేలోపే.వ్య‌తిరేక ప్ర‌చారం చేరిపోయింది.

ఇక‌, రేష‌న్ స‌రుకులు తీసుకునేందుకు ల‌బ్ధి దారులు ఇప్ప‌టివ‌ర‌కు ఒక‌సారి వేలి ముద్ర వేస్తే.స‌రిపోయేది.

కానీ, ఇప్పుడు మాత్రం రెండు సార్లువేలిముద్ర‌లు వేయాల్సి వ‌స్తోంది.

Telugu Andhra Pradesh, Central Holders, China, Corona, Farmers, Finger Print, Ke

దీంతో ఇది క‌రోన వ్యాప్తికి దారితీస్తుంద‌ని, జ‌గ‌న్ అతితెలివికి ఇది నిద‌ర్శ‌న‌మ‌ని టీడీపీ దుయ్య‌బ‌ట్టింది.అయితే, వాస్త‌వానికి ఇది కూడ కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణ‌య‌మే.అలా రెండు సార్లు వేలిముద్ర‌లు తీసుకోండి.

బియ్యానికి ఒక‌సారి.ఇత‌ర రేష‌న్ స‌రుకుల‌కు రెండోసారి వేలిముద్ర తీసుకోవాల‌ని కేంద్ర‌మే ష‌రతు పెట్టింది.

అయితే, ఈ విష‌యాన్ని కూడా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ల‌డంలో ప్ర‌భుత్వం తాత్సారం చేయ‌డంలో అప‌వాదు మొత్తం జ‌గ‌న‌పైనే ప‌డింది.మ‌రో తాజా నిర్ణ‌యం విష‌యానికి వ‌స్తే.

రాష్ట్రంలో వాహ‌న‌దారులు రూల్స్ అతిక్ర‌మిస్తే.జ‌గ‌న్ ప్ర‌బుత్వం భారీగా ఫైన్లు విధించేందుకు రెడీ అయింది.
ఈ క్ర‌మంలో ఆయా ఫైన్లు ప‌రిశీలిస్తే.అన్నీ వేల‌ల్లోనే ఉన్నాయి.దీంతో ఆయ‌న‌పై మ‌రోసారి వ్య‌తిరేక మీడియా దుమ్మెత్తిపోయ‌డం ప్రారంభించింది.కానీ, వాస్త‌వం ప‌రిశీలిస్తే.

ఏడాదిన్న‌ర కింద‌ట కేంద్రం తీసుకువ‌చ్చిన కొత్త వాహ‌న చ‌ట్టం మేర‌కు ఉన్న ఫైన్ల‌ను ఇప్పుడు జ‌గ‌న్ అమ‌లు చేస్తున్నారు.అప్ప‌ట్లో కొన్ని రాష్ట్రాలు దీనిని అమ‌లు చేశాయి.

త‌ర్వాత ప్ర‌జావ్య‌తిరేక‌త నేప‌థ్యంలో ప‌క్క‌న పెట్టాయి.అయితే, కేంద్రం ఒత్తిడి నేప‌థ్యంలో జ‌గ‌న్ ఇప్పుడు ఫైన్లు త‌గ్గించి అమ‌లు చేయాల‌ని చూస్తున్నారు.

 అయిన్ప‌టికీ.ఆయ‌న ఈ విష‌యాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ల‌లేక‌పోతున్నారు.

ఇలా.కేంద్రం చేసిన పాపాలు జ‌గ‌న్ మెడ‌కు చుట్టుకుంటున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube