తిరుపతి టూర్ క్యాన్సిల్ చేసుకున్న జగన్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సడన్ గా తిరుపతి పర్యటన రద్దు చేసుకున్నారు.ఈనెల 14వ తారీఖున తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్డు షో, భారీ బహిరంగ సభలో ప్రసంగించాలి అని భావించిన సీఎం జగన్.

 Ys Jagan Canceled His Tirupati Tour-TeluguStop.com

ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది.ముఖ్యంగా రాష్ట్రంలో తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఇటీవల కాలంలో కేసులు ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి.

దీంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ తిరుపతి పార్లమెంటు ఓటర్లకు బహిరంగ లేఖ రాయడం జరిగింది.కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో తాను రాలేకపోతున్నట్లు లెటర్లో స్పష్టం చేశారు.

 Ys Jagan Canceled His Tirupati Tour-తిరుపతి టూర్ క్యాన్సిల్ చేసుకున్న జగన్..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాను ఎన్నికల ప్రచారానికి వస్తే పెద్దఎత్తున కార్యకర్తలు మరియు ప్రజలు సభకు వచ్చే అవకాశం ఉండటం వలన కరోనా కేసులు పెరిగే పరిస్థితి ఉండటంతో బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా తాను తిరుపతి పర్యటన రద్దు చేసుకుంటున్నట్లు సీఎం జగన్ తెలిపారు.ఈ క్రమంలో తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు ప్రభుత్వ పనితీరు గుర్తించి తన సోదరుడు డాక్టర్ గురుమూర్తి ఎన్నికల గుర్తు ఫ్యాన్ కి ఓట్లు వేయాలని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జగన్ లెటర్ లో విజ్ఞప్తి చేశారు.

#YS Jagan #Corona Virus

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు