జగన్ క్యాబినెట్ ఇదేనా ? వైరల్ గా మారిన పేర్ల లిస్ట్

ఆరాటం పెళ్ళికొడుకు పేరంటానికి వెళ్లినట్టుగా వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కొందరు అప్పుడే జగన్ గవర్నమెంట్ వచ్చేసినట్టు, మంత్రిమండలి లిస్ట్ రెడీ అయిపోయినట్టు హడావుడి చేసేస్తున్నారు.ఇంకా ఎన్నికల ఫలితాల ప్రకటనకు వారం రోజుల సమయం కూడా లేదు.

 Ys Jagan Cabinet Ministers List Goes Viral-TeluguStop.com

ఈలోపున అటు వైసీపీ, ఇటు టీడీపీ గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తున్నాయి.ఈ ధీమా తెలుగుదేశం పార్టీలో కంటే వైసీపీలో ఎక్కువగా కనిపిస్తోంది.

గత ఎన్నికల్లో కేవలం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుని ఉంటే జగన్ అధికారంలోకి వచ్చేవాడు.కానీ అప్పుడు గెలుస్తామనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ అయిపోవడంతో అధికారం దూరం అయిపొయింది.

అయితే ఇప్పుడు పోలింగ్ సరళిని బట్టి చూస్తే జగన్ కు అధికారం దక్కడం ఖాయమనే అంచనాలు అందరిలోనూ ఉన్నాయి.

ఆ మేరకు జగన్ కు గెలుపు మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండడంతో లోటస్ పాండ్ నుంచి అమరావతికి తన మకాం ను , పార్టీ ఆఫీస్ ను మార్చేశారు.

ఎలాగూ జగన్ సీఎం కావడం ఖాయమేనని, మరి అలాంటప్పుడు ఆయన కేబినెట్ లో ఎవరెవరు ఉంటారు ? ఎవరికి ఏ శాఖ అన్న విషయాలపై ఇప్పుడు సోషల్ మీడియాలో హడావుడి జరుగుతోంది.పూర్తి స్థాయి కేబినెట్ లో జగన్ ఎవరెవరికి ఏఏ శాఖలు కేటాయిస్తారన్న సమగ్ర సమాచారం ఉన్న ఈ పోస్ట్ ఆసక్తి రేకెత్తిస్తోంది.

స్పీకర్ పోస్టును దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు కేటాయించనున్న జగన్… డిప్యూటీ స్పీకర్ పదవిని మహిళా నేత పాముల పుష్ప శ్రీ వాణికి ఇవ్వనున్నట్లుగా ఆ సోషల్ మీడియా పోస్టింగ్ లో ఉంది.ఇక ఈ పోస్ట్ ప్రకారం జగన్ కేబినెట్ ఈ విధంగా ఉండబోతోందట.

-Telugu Political News

ముఖ్యమంత్రి – వై యస్ జగన్ మోహన్ రెడ్డి
స్పీకర్ – దగ్గుబాటి వెంకటేశ్వర రావు
డిప్యూటీ స్పీకర్ – పాముల పుష్ప శ్రీవాణి

మంత్రులు- శాఖలు

1.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి -హోంశాఖ
2.బొత్స సత్యనారాయణ – రోడ్లు ,భవనాలు
3.ధర్మాన ప్రసాదరావు – రెవెన్యూశాఖ
4.

బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి -ఆర్థిక శాఖ
5.కొడాలి నాని – భారీ నీటిపారుదల శాఖ
6.

గడికోట శ్రీకాంత్ రెడ్డి – మున్సిపల్ శాఖ
7.తానేటి వనిత – స్త్రీ , శిశు సంక్షేమ శాక
8.పిల్లి సుభాష్ చంద్రబోస్ -పౌర సరఫరాలుశాఖ
9.అవంతి శ్రీనివాస్ -వైద్య ఆరోగ్యశాఖ
10.

కురసాల కన్నబాబు -విద్యాశాఖ
11.తమ్మినేని సీతారాం -బీసీ సంక్షేమం
12.

శిల్ప చక్రపాణి రెడ్డి -అటవీశాఖ
13.వై.విశ్వేసర్ రెడ్డి -న్యాయశాఖ
14.కోన రఘుపతి -దేవాదాయ ధర్మదాయశాఖ
15.ఆనం రాంనారాయణ రెడ్డి -పంచాయితీరాజ్
16.మోపిదేవి వెంకటరమణ -ఐటీ శాఖ మంత్రి
17.ఆర్.కే.రోజా -విద్యుత్ శాఖ
18.బాలినేని శ్రీనివాస్ రెడ్డి -భూగర్భ గనులశాఖ
19.గ్రంధి శ్రీనివాస్ -సినిమాటోగ్రఫీ
20.ఆళ్ళ నాని -కార్మిక – రవాణా శాఖ
21.కె.భాగ్యలక్ష్మి – సాంఘీక సంక్షేశాఖ
22.ఆళ్ళ రామకృష్ణ రెడ్డి -వ్యవసాయ శాఖ మంత్రి
23.అమంచి కృష్ణ మోహన్ -మార్కెటింగ్ మరియు పశు సంవర్థక
24.కె.ఇక్బాల్ అహ్మద్ -పర్యావరణ శాఖ
25.కొక్కిలిగడ్డ రక్షణనిధి -హౌసింగ్
26.కాకాని గోవర్ధన్ రెడ్డి -భారీ పరిశ్రమల శాఖ

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube