అలా ఎందుకు చేయలేకపోతున్నారు ? మంత్రులపై జగన్ ఆగ్రహం ?

అమరావతి ప్రాంతంలో ఎగిసిపడుతున్న రాజధాని ఉద్యమాన్ని ఎలా చల్లార్చాలో తెలియక సీఎం జగన్ సతమతం అయిపోతున్నాడు.మూడు రాజధానులు అంటూ జగన్ ప్రతిపాదన పెట్టిన తరువాత మొదట్లో ఇంత వ్యతిరేకత కనిపించకపోయినా ఆ తరువాత టీడీపీ ఆ ప్రాంత ప్రజలను బాగా రెచ్చగొట్టి రాజకీయంగా బాగా బలపడింది.

 Ys Jagan Cabinet Ministers Andhra Pradesh-TeluguStop.com

కానీ అమరావతి నుంచి రాజధానిని తరలించడంలేదు మరో చోట కూడా పెడుతున్నాము అంతే అనే విషయాన్ని చెప్పుకోవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలం అవ్వడంతో ఇప్పుడు వైసీపీ రాజకీయంగా బాగా ఇబ్బందులు ఎదుర్కుంటోంది.టీడీపీ రగిల్చిన చిచ్చు రాజధాని ప్రాంతంలోనే కాకుండా రాష్ట్రమంతా అంటుకోవడం తో వైసీపీ బాగా ఇబ్బందులు పడుతోంది.

అమరావతి ప్రాంతంలో రైతులకు నచ్చచెప్పడంతో ఆ ప్రాంత ఎమ్యెల్యేలు, మంత్రులు విఫలం అయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి.ఇదే రకమైన అభిప్రాయం సీఎం జగన్ లోనూ ఉంది.

సీనియర్ మంత్రులు ఉన్నా సరే రైతులను కలిసి మాట్లాడటం లేదని, కృష్ణా గుంటూరు జిల్లాల్లో అయిదుగురు మంత్రులు ఉన్నా వారు సరిగా స్పందించడం లేదు అనే అభిప్రాయంతో ఉన్న జగన్ మంత్రులపై ఆగ్రహంగా ఉన్నారట.స్థానిక ఎమ్మెల్యేల సహకారం తీసుకుని చర్చలు జరిపి ఉద్యమాన్ని తగ్గించే ప్రయత్నం చేయడం లేదనే అసహనం జగన్ లో తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తోంది.

దీంతో ఇప్పుడు వారిని మంత్రి వర్గం నుంచి సాగనంపే ఆలోచనలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారట.

Telugu Amaravathi, Chandrababu, Janasena, Pawan Kalyan, Ys Jagan, Ysrcp-Telugu P

రాజకీయంగా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తున్నా సరే కనీసం తనను కూడా సంప్రదించకుండా చోద్యం చూస్తున్నారని, ఈ విషయం తమకు ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని, మూడు రాజధానుల వలన ఉపయోగాలను ప్రజలకు వివరించడం లేదని, రైతులకు ప్రభుత్వం ఎం చేస్తుందో చెప్పడం లేదని జగన్ తీవ్ర అసహనంతో ఉన్నారట.అందుకే మంత్రులు పనితీరుపై రహస్యంగా సర్వే చేయిస్తున్న జగన్ పనితీరు సక్రమంగా లేని వారి వల్ల పార్టీకి, ప్రభుత్వానికి ప్రయోజనం లేనప్పుడు వారిని మంత్రి పదవుల్లో ఉంచినా ఉపయోగం ఉండదు అనే భావనతో త్వరలోనే వారిని సాగనంపే కార్యక్రమానికి తెర తీసినట్టు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube