జగన్ బడ్జెట్ జనరంజకంగానే ఉందా ?

తీసాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తిని, మాట తప్పను మడమ తిప్పను అంటూ ఎప్పుడూ చెబుతూ ఉండే వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు సీఎంగా బాధ్యతలు చేపట్టాక తాను చెప్పింది చేసి చూపించే ప్రయత్నం చేసాడు.అప్పట్లో వైసీపీ ప్లీనరీలో ప్రకటించిన ‘నవరత్నాలు’ అనే మ్యానిఫెస్టోని ఇప్పుడు అమలు చేసేందుకు బడ్జెట్ లో భారీగా కేటాయింపులు చేసాడు.

 Ys Jagan Budget Is Correct To Common Peoples-TeluguStop.com

అప్పటి అధికారపక్షం టీడీపీ నవరత్నాలలో కొన్ని పథకాలను చివరిలో అమలు చేయడం ప్రారంభించినప్పటికీ జగన్ ఎక్కడా వెనకడుగు వేయలేదు.ఏపీ బడ్జెట్ ప్రసంగాన్ని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చదివి వినిపిస్తూంటే ప్రతి ఒక్కరికి ఏదో ఓ ప్రయోజనం బడ్జెట్ లో ఉన్నట్టే కనిపించింది.

-Telugu Political News

రైతులు, పేదలు, మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, వితంతువులు, వికలాంగులు.ఇలా చెప్పుకుంటూపోతే అన్ని వర్గాల వారికీ ఉపయోగపడేలా బడ్జెట్‌లో కేటాయింపులు జరిగాయి.ప్రతి ఒక్కరికీ ఆర్థికంగా చేదోడు వాదోడుగా ఉండేందుకు అనేక సంక్షేమ పథకాలకే అత్యధిక కేటాయింపులు చేశారు.రూ.2.27 లక్షల కోట్ల బడ్జెట్లో రూ.75 వేల కోట్లకు పైగా సంక్షేమ రంగానికే కేటాయించారు.ముఖ్యంగా రైతుల కోసం రూ.28,866 కోట్లు కేటాయించారు.నవవరత్నాల్లో దాదాపు ఎనభై శాతం పథకాలకు నిధులు కేటాయించారు.

వచ్చే ఏడాది మిగతా వాటికీ కేటాయింపులు చేయాలనీ చూస్తున్నారు.నవరత్నాలలో ఉన్న పథకాలు అమలు చేయడం ఎంత ముఖ్యమో అందరికి తెలిసేలా జగన్ అనేక ఏర్పాట్లు చేసాడు.

ప్రతి ఒక్కరి దగ్గర నవరత్నాల మేనిఫెస్టో ఉండాలని ఉద్యోగులను ఆదేశించారు.దానికి తగ్గట్లుగానే ఆయన సచివాలయం చాంబర్‌కు వెళ్లే దారిలో గోడలకు నవరత్నాల పోస్టర్స్ ను అంటించమని ఆదేశించారు.

అలా చెప్పడమే కాదు ఈ బడ్జెట్ ద్వారా దాన్ని నిరూపించే ప్రయత్నం చేశారు.హామీలన్నింటికీ నిధులు కేటాయించారు.

-Telugu Political News

ఇక భారీ పథకాలు అనుకున్న వాటికి కూడా ఈ బడ్జెట్ లో కేటాయింపులు చేసి జగన్ తానేంటో నిరూపించుకునే ప్రయత్నం చేసాడనే చెప్పాలి.ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్ట్‌కు రూ.ఐదు వేల కోట్లకు పైగా కేటాయించి అందరిని ఆశ్చర్యపరిచాడు.అలాగే అమరావతి నిర్మాణానికి ఐదు వందల కోట్లను కేటాయించడం అందరిని షాక్ కి గురిచేసింది.

ఎందుకంటే జగన్ మ్యానిఫెస్టోలో ఎక్కడా రాజధాని నిర్మాణానికి సంబందించిన ఊసే లేదు.అసలు వైసీపీ ఎక్కడా ఆ ప్రస్తావన తీసుకురాలేదు.బడ్జెట్ లో కేటాయింపులు పరంగా చూస్తే ఎక్కడా విమర్శలకు ఆస్కారమే లేనట్టుగా కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube