జగన్ కు వణుకు తెప్పిస్తున్న ఆ ఓట్లు ....?  

  • ఏపీలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో గెలుపు అనేది ఏ రాజకీయ పార్టీకి అంత సులువైన అంశం కాదు. ఎందుకంటే… ఎప్పుడూ లేనివిధంగా ఇప్పుడు నాలుగు ప్రధాన పార్టీలు పోటీకి సై అంటే సై అంటూ కాలు దువ్వుతున్నాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ పోటీలో నిల్చున్నా… పెద్దగా ప్రయోజనం కూడా లేదు అన్నట్టుగానే పరిస్థితి ఉంది. అయితే జనసేన , వైసీపీ , టీడీపీ ల మధ్య టఫ్ ఫైట్ ఉండబోతున్న నేపథ్యంలో గెలుపు కోసం ఈ మూడు పార్టీల అధినేతలు ఆశలు పెట్టుకుని ముందుకు వెళ్తున్నారు.

  • YS Jagan Bothering About That Kapu Vote Bank-Janasena Party Kapu Bank Nara Lokesh Pawan Kalyan Janasena Ycp Ys

    YS Jagan Bothering About That Kapu Vote Bank

  • అధికార పార్టీ టీడీపీ మరోసారి అధికారం దక్కించుకునేందుకు అనేక సంక్షేమ పధకాలు ప్రకటిస్తూ శరవేగంగా ముందుకు వెళ్తుంటే… జనసేన ఇప్పుడిప్పుడే బలపడుతూ… ఒక ప్రధానమైన సామజిక వర్గం ఓట్లను తమ పార్టీ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో అధికారం కోసం చాలా కాలంగా ఎదురుచూపులు చూస్తున్న జగన్ ఈ రెండు పార్టీలను ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు.

  • విఏసీపీ కి ఈ ఎన్నికల్లో అధికారం దక్కించుకోవడం అత్యవసరం. ఎందుకంటే… ఇప్పుడు కనుక అధికారం దక్కించుకోకపోతే… మనుగడే కష్టం. ఆ విష్యం జగన్ కు కూడా బాగా తెలుసు కాబట్టే గట్టిగా కష్టపడుతున్నాడు. అయితే జగన్ ను ఇప్పుడు ఓ విషయం మాత్రం బాగా భయపెట్టేస్తోంది. అదే ఓట్ల తొలిగింపు. దొంగ ఓట్లు ఉన్నాయని ఓట్లను తొలగిస్తున్నారని ఢిల్లీకి వెళ్లి మరీ ఫిర్యాదు కూడా… చేశారు. సమర శంఖారావం సభలోనూ అదే చెబుతున్నారు. సర్వేలు చేసి మరీ ఓట్లు తొలగిస్తున్నారని చెబుతున్నారు. ఓట్ల జాబితా విషయంలో వైసీపీ తీవ్రంగా ఆందోళన చెందుతోందన్న విషయం దీనితో స్పష్టమైంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనను ఎన్నికల సంఘం మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇది జగన్ లో మరింత కంగారు పెంచుతోంది.

  • YS Jagan Bothering About That Kapu Vote Bank-Janasena Party Kapu Bank Nara Lokesh Pawan Kalyan Janasena Ycp Ys
  • దీనికి తోడు తెలంగాణ ఎన్నికల ముందు దాదాపుగా ఇరవై లక్షలకు పైగా ఓట్లు గల్లంతయ్యాయి. దీనికి ఎన్నికల అధికారి క్షమాపణ కూడా చెప్పారు. ఆ ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులవేనని వార్తలు కూడా వినిపించాయి. అయితే అందులో ఎంత నిజం ఉంది …? ఎంత అబద్దం ఉంది అనేది పక్కనపెడితే …చాలా చోట్ల అభ్యర్థుల గెలుపు ఓటమిని ఇవి ప్రభావితం చేశాయని కాంగ్రెస్ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు.

  • కానీ అటువంటి పరిస్థితి ఏపీలో ఉండకూడదని వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాకపోతే తెలంగాణలో ముందస్తు ఎన్నికల కారణంగా… ఓటర్ల జాబితాను సవరించకుండా ఉన్న జాబితాతోనే ఎన్నికలకు వెళ్లారు. ఈ కారణంగా పెద్ద సంఖ్యలో ఓట్లు గల్లంతయ్యాయి.ఇప్పుడు అదే పరిస్థితి ఉండకపోవచ్చు. ఒకవేళ అదే పరిస్థి మళ్ళీ ఏపీలోనూ రిపీట్ అయితే తమ ఆశలు కూడా ఆ ఓట్లవలె గల్లంతవుతాయని వైసీపీ లో ఆందోళన మొదలయ్యింది.