జగన్ సూటి ప్రశ్నలు..జవాబుందా బాబు..???  

  • ఏపీలో ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో పార్టీల అధినేతలు తమ వ్యాఖ్యలకి తగ్గట్టుగా స్పీడు పెంచుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే వైసీపీ, టీడీపీ లపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతుండగా. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పవన్ పై ప్రేమని ఒలకబోస్తూ ,జగన్ రెడ్డి పై తీవ్ర ఆరోపణలు చేస్తూ ప్రజలని తనవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు పవన్ పొత్తు కోసం పరి తపించి పోతున్నారు.

  • ఇదిలాఉంటే తన పాదయాత్రతో ఏపీ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ దూసుకెళ్తున్న జగన్ రెడ్డి విషయంలో కోడి కత్తి ఘటన టీడీపీ అధినెతకీ ఎంతటి తలనేప్పులు తెచ్చిపెట్టిందో వేరే చెప్పనక్కర్లేదు. ఈ కేసు ఎన్ఐఏ వరకూ వెళ్ళింది. దాంతో బాబు పరువు కాస్తా పోయింది అయితే. ఇప్పుడు ఈ విషయంపై జగన్, చంద్రబాబు కి కొన్ని సూటి ప్రశ్నలని సంధించాడు…ఈ ప్రశ్నలకి జవాబులు చెప్పే దమ్ముందా అనే బాబుకి షాక్ ఇస్తున్నారు వైసీపీ నేతలు. ఇంతకీ జగన్ సంధించిన ప్రశ్నలు ఏమిటంటే.

  • YS Jagan Attack  Questions To Chandrababu-Jagan Ys

    YS Jagan Attack, Jagan Questions To Chandrababu

  • నా పాదయాత్ర విశాఖ జిల్లాలోకి ప్రవేశించిన సమయం నుంచీ ఎయిర్పోర్ట్ లో సీసీ కెమెరాలు పని చేయడం లేదు. నాపై దాడి చేసిన వ్యక్తిపై గతంలోనే ఓ హత్యాయత్నం కేసు నమోదు అయ్యి ఉంది. అయినా అలాంటి వాడిని ఒక ఎయిర్పోర్ట్ లోకి అనుమతించాలి అంటే పోలీసులు అతడికి నో అబ్జక్షన్ సర్టిఫికేట్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఇదిలాఉంటే ఆ హోటల్ ఒక టీడీపీ నేతది, గతంలో ఆయన టీడీపీ నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. అందులో మరో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పాత్ర ఉంది ఆయన వంగవీటి రంగా హత్య కేసులో ఉన్న వ్యక్తి. ఇలాంటి అంశాలన్నీ ఈ కేసులో ఉన్నప్పుడు, నాపై కత్తి దాడి ఓ అభిమాని చేసిన పని ఎలా అవుతుంది అంటూ జగన్ ప్రశ్నలు మీద ప్రశ్నలు సంధించారు.

  • YS Jagan Attack  Questions To Chandrababu-Jagan Ys
  • జగన్ లాగిన లాజిక్ కి టీడీపీ అధినేతకి నోట మాట రాలేదు సరికదా ఇప్పటి వరకూ ఈ ప్రశ్నలకి టీడీపీ బ్యాచ్ వివరణ కూడా ఇవ్వలేక పోయాయి. జగన్ పై ఎవరు దాడి చేశారు, ఎందుకు చేశారు ఎవరితో ఎవరు చేయించారు అనే విషయాలు భవిష్యత్తులో ఎలాగో తేలుతాయి కాని. ఈ మొత్తం ఎపీసోడ్ లో నష్ట పోయింది, పరువు పోగొట్టుకుంది మాత్రం టీడీపీ పార్టీనే అని చెప్పడం లో మాత్రం సందేహం లేదు అంటున్నారు విశ్లేషకులు.