బీజేపీ పై జగన్ అస్త్రాలు ? కేసీఆర్ బాటలోనే ?

ఏపీలో బీజేపీకి బలం లేకపోయినా , కేంద్రంలో ఆ పార్టీ అధికారంలో ఉండడం తో అన్ని రాజకీయ పార్టీలు బీజేపీ విషయంలో భయం భక్తులతో ఉంటూ వస్తున్నాయి.టిడిపి, జనసేన, వైసిపి ఇలా అన్ని పార్టీలు బీజేపీపై విమర్శలు చేసేందుకు సాహసించడం లేదు.

 Ys Jagan Angry On Bjp, Jagan,ysrcp,ap, Tdp, Chandrababu Naidu,narendra Modi, Ami-TeluguStop.com

బీజేపీ తో పెట్టుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఈ పార్టీల అధినేతలకు బాగా తెలుసు.అందుకే మౌనంగానే ఉంటూ వస్తున్నారు.

వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్ అయితే బీజేపీ విషయంలో మొదటి నుంచి సానుకూలంగా ఉంటూనే వచ్చారు.
తాను పెద్ద ఎత్తున అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకి గాని,  పెండింగ్ ప్రాజెక్టులు , నిధులు ఇలా అనేక అంశాలు ముడిపడి ఉండటంతో , తప్పనిసరి పరిస్థితుల్లో కేంద్ర బీజేపీ ప్రభుత్వం తో సన్నిహితంగా మెలిగేందుకు ప్రయత్నిస్తున్నారు.

అంతేకాదు , జాతీయ స్థాయిలో బీజేపీ ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవడం తో పాటు, ఎన్డీయే లోని మిత్రపక్షాలు ఆ పార్టీకి దూరమైనా, జగన్ ఆపద సమయంలో బీజేపీకి అండగా నిలుస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులకు మద్దతు తెలుపుతూ, బీజేపీతో సన్నిహితంగా మెలిగేందుకు ప్రయత్నిస్తూ వస్తున్న , వైసిపి విషయంలో కానీ,  ఏపీ ప్రభుత్వం విషయంలో గాని బీజేపీ వైఖరి జగన్ కు ఏమాత్రం నచ్చడం లేదు.

Telugu Amit Shah, Chandrababu, Cm Kcr, Jagan, Narendra Modi, Somu Veerraju, Ysrc

ఏపీ కి నిధులు ఇస్తూ, తెలుగుదేశం పార్టీ తరహాలో తమపై విమర్శలు చేస్తూ వస్తున్న బీజేపీ పై కఠిన వైఖరి అవలంబించాలని చూస్తున్నారు.చివరకు బీజేపీ పై విమర్శలు చేసేందుకు వైసీపీ నాయకులు ఎవరు మొన్నటి వరకు సాహసించేవారు కాదు.దీనికి కారణం వైసిపి అధిష్టానం బీజేపి విషయంలో ఎవరు అనవసరంగా నోరు పారేసుకోవద్దు అనే మౌఖిక ఆదేశాలు ఇవ్వటమే కారణం.

అయితే ఇప్పుడు ఆ నిబంధనలను సడలించినట్లు తెలుస్తోంది.బీజేపీ విషయంలో కఠినంగా వ్యవహరించాలని తెలుగుదేశం తో సమానంగా ఆ పార్టీపై విమర్శలు చేసి, తమపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలకు గట్టి కౌంటర్ ఇవ్వాలని జగన్ డిసైడ్ అయ్యారట.

కొద్దిరోజులుగా జగన్ ఆ పార్టీ నాయకుల వ్యవహార శైలి చూస్తే ఈ విషయం అర్థమవుతుంది.తెలంగాణ సీఎం కేసీఆర్ బాటలోనే వెళ్లి బీజేపి ని ఢీ కొట్టాలని జగన్ డిసైడ్ అవ్వడం ఆసక్తి కలిగిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube