ఏపీని హెల్త్ హబ్ గా మార్చడానికి సీఎం జగన్ సెన్సేషనల్ ప్లాన్..!!

ఇటీవల కోవిడ్ నియంత్రణ పై సమీక్ష సమావేశం నిర్వహించిన క్రమంలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.కరోనా ట్రీట్మెంట్ కోసం ప్రజలు ఇతర రాష్ట్రాలకు ఎందుకు వెళ్లాల్సి వస్తుందో ఒకసారి అధికారులు ఆలోచించాలని జగన్ తెలియజేయడం జరిగింది అట.

 Ap Cm Ys Jagan Andhra Pradesh Health Hub Sensational Plan , Ys Jagan, Andhra Pra-TeluguStop.com

ఈ సందర్భంగా జిల్లా కేంద్రాలతోపాటు ప్రధాన కేంద్రాలలో హెల్త్ హబ్ లు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.మొత్తం రాష్ట్రంలో 16 చోట్ల ఈ హెల్త్ హబ్ లు ఏర్పాటు చేయాలని, జిల్లా కేంద్రాలతోపాటు విజయవాడ, తిరుపతి, రాజమండ్రి వంటి చోట్ల.

హెల్త్ హబ్ లు ఉండేలా.ఏర్పాట్లు చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా కనీసం ఒక్కో హెల్త్ హబ్ కి కనీసం 30 నుంచి 50 ఎకరాల భూసేకరణ చేపట్టాలని అదే రీతిలో ఒక ఆసుపత్రికి ఐదు ఎకరాలు కేటాయించాలని తెలియజేశారు సీఎం.మూడు సంవత్సరాలలో ఒక కనీసం 100 కోట్లు పెట్టుబడి పెట్టే ఆసుపత్రులకు ఈ భూములను ఇవ్వాలని అధికారులకు జగన్ సూచించారు.

దీని వలన కనీసం 80 మల్టీ హాస్పిటల్స్ తో పాటు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు వస్తాయని అంచనా వేశారు.ఇదే తరుణంలో ప్రభుత్వం తరఫున మరో 16 ప్రభుత్వ వైద్య నర్సింగ్ కాలేజీలు… వస్తున్నాయని .ప్రభుత్వ పరంగా ఆరోగ్య కేంద్రం బలోపేతం కావడంతో పాటు.ప్రభుత్వ ప్రోత్సాహకరంగా ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

దీనివల్ల టెరిషరీ కేర్ విస్తృతంగా మెరుగుపడే అవకాశం ఉందని పేర్కొన్నారు.ఈ విధానం ద్వారా ప్రజలు ఆరోగ్య శ్రీ ద్వారా మెరుగైన వైద్యం పొందగలుగుతారు అని.అదే రీతిలో ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా ఉంటారని నెల రోజుల్లోనే కొత్త పాలసీని తీసుకురావాలని అధికారులకు జగన్ దిశానిర్దేశం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube