ఇంగ్లీష్ మీడియంపై ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన హైకోర్టు

ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీ వరుసగా వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలని అయోమయంలో పడేస్తున్నాయి.ప్రతి చోట తన మార్క్ చూపించుకోవాలని ప్రయత్నం చేస్తూ కొత్త కొత్త జీవోలు తీసుకొస్తున్నారు.

 Ys Jagan Andhra Pradesh Angla Vidhya-TeluguStop.com

అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్భంద ఇంగ్లీష్ మీడియం అమలు చేయడానికి బిల్లు తీసుకొచ్చి దానిని అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం అప్పుడే మొదలెట్టేసారు.దీనికి సంబంధించి సిలబస్ మీద కార్యాచరణ మొదలెట్టారు.

ఆంగ్ల తెలుగు మీడియంని పూర్తిగా రద్దు చేసి కేవలం తెలుగుని ఒక సబ్జెక్ట్ గా మాత్రమే ఉంచి తెలుగు భాషాభిమానుల కోపానికి కారణం అయ్యారు.అయితే ఎవరు ఎన్ని చేసిన తాము పట్టిన కుందేలుకి మూడే కళ్ళు అన్నట్లు నిర్భంద ఇంగ్లీష్ మీడియం అమలు చేయడానికి జగన్ సిద్ధమైపోయారు.

అయితే ఇప్పుడు దీనిపై హైకోర్టు సీరియస్ అయ్యింది.

విద్యా హక్కు చట్టాన్ని, సుప్రీం తీర్పుని తుంగలో తొక్కి జగన్ తీసుకున్న ఇంగ్లీష్ మీడియం నిర్ణయంపైశ్రీనివాస్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ అంశం పై విచారణ జరిపిన హైకోర్టు ఏపీ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.విద్యార్థులు తాము కోరుకున్న మీడియంలో చదువుకునే ఆప్షన్ లేకుండా నిర్భంద ఇంగ్లిషు బోదన ఎలా అమలు చేస్తారని ప్రశ్నించింది.

సుప్రీం ఆదేశాలకు విరుద్ధం గా ఎలా నిర్ణయం తీసుకున్నారో చెప్పాలని అడిగింది.ఇంగ్లిషు మీడియం కోసం పుస్తకాల ముద్రణ, శిక్షణ తరగతులు చేపడితే అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అలాగే వాటి కోసం పెట్టే ఖర్చులను సైతం అధికారుల నుంచి వసూలు చేస్తామని కోర్టు పేర్కొంది.

ఈ అంశంపై పూర్తి వివరాలతో అఫిడవిట్ ను దాఖలు చేయాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది.జగన్ తీసుకుంటున్న ఇలాంటి నిరంకుశ నిర్ణయాలకి హైకోర్టు అడుగడుగునా అడ్డు పడుతూ ఉండటంతో ఇప్పుడు హైకోర్టులో న్యాయమూర్తులని కూడా వైసీపీ నేతలు రాజకీయాలల్లోకి లాగుతున్నారు.

మరి ఈ ఇంగ్లీష్ మీడియంపై వైసీపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube