ఫెడరల్ ఫ్రంట్ లోకి...'జగన్ ,పవన్'...?

టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడంతో ఒక్క సారిగా రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి.ఈ ప్రభావం తప్పకుండా ఏపీ రాజకీయాలపై చూపుతుందని చెప్పడంలో సందేహం లేదు.

 Ys Jagan And Pawan Kalyan In To Federal Front-TeluguStop.com

ఏపీలో తన గెలుపుపై తన పార్టీ జీవంపై దృష్టి పెట్టని చంద్రబాబు తగుదునమ్మా అంటూ తెలంగాణలో చక్రం తిప్పాలని అనుకుంటే అది కాస్తా పంచర్ పడింది.దాంతో ఇక ఏపీలో సైతం బాబు ఘోరంగా ఓడిపోవడం ఖాయమని తేల్చేస్తున్నారు రాజకీయ పండితులు.అయితే…

కేసీఆర్ తన గెలుపు తరువాత మాట్లాడిన మాటల్లో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తా కాంగ్రెస్ ,బిజేపీ కి చుక్కలు చూపిస్తా అంటూ చెప్పడంతో ఇప్పుడు సర్వాత్రా ఉత్ఖంట రేగుతోంది.ఈ ఫెడరల్ ఫ్రంట్ లో ఎపీ నుంచీ చేరేది జనసేన పార్టీనా లేక జగన్ మోహన్ రెడ్డి నా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది అయితే.రాజకీయ విశ్లేషకుల అంచనాలు మాత్రం దీనికి భిన్నంగా ఉన్నాయి అదేంటంటే.

కేసీఆర్ ప్రకటించిన ఫెడరల్ ఫ్రంట్ విషయంలో దేశంలో ఎన్ని పార్టీలు అనుకూలంగా ఉన్నాయో తెలియదు కాని ఏపీలో మాత్రం ఎవరు కేసీఆర్ తో జట్టు కడుతారు అనేది సస్పెన్స్ గా మారింది .ఎందుకంటే ఏపీలో తెలుగు దేశం , వైసీపీ , జనసేన ఈ మూడులో ఎలాగో కేసీఆర్ టీడీపీ ని ఫ్రంట్ లో చేరుచుకోరు ఇక మిగిలినవి వైసీపీ, జనసేన రెండు పార్టీలు ఈ రెండు పార్టీలు కూడా కేసీఆర్ కి అనుకూలమైన పార్టీలుగా ముందు నుంచీ ఉన్నాయి.తాజాగా కేసీఆర్ గెలుపుపై వీరి స్పందన చూస్తె చాలు వీరు కేసీఆర్ కి ఎంతటి వినయ విదేయులో అర్థం అవుతుంది.

జగన్, పవన్ లు ఇద్దరూ కేసీయార్ ఘన విజయాన్ని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు కూడా.ఈ ఇద్దరి దూకుడు చూస్తుంటే కేసీఆర్ ఫ్రంట్ లోకి ఎప్పుడు దూకేద్దమా అనే సందేహం కూడా రాకపోదు.మరి ఈ ఇద్దరిలో ఎవరిని కేసీఆర్ తన ఫ్రంట్ లోకి చేర్చుకుంటారు అనే విషయంలో రాజకీయ పరిశీలకులు మాత్రం భిన్నంగా సమాధానం చెప్తున్నారు.ఈ రెండు పార్టీలు కేసీయార్ ఫ్రంట్ లో ఉంటారని తెగేసి చెప్తున్నారు.

అంతేకాదు రేపు వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఈ రెండు పార్టీలని కలిపే భాద్యత కూడా కేసీఆర్ తీసుకుకునే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు.మరి భవిష్యత్తు రాజకీయాలు ఎలాంటి రూపు సంతరించుకుంటాయో వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube