జగన్ పవన్ ల మధ్య డీల్ సెట్ చేస్తున్న టీఆర్ఎస్ ...?     2019-01-12   10:00:36  IST  Sai Mallula

జనసేన వైసిపి మధ్య రాజకీయ వైరం గురించి కంటే ఆ రెండు పార్టీల మధ్య ఏర్పడబోయే పొత్తు గురించి చర్చ గత కొంతకాలంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ రెండు పార్టీలకు సంబంధించిన కీలక నాయకులు పొత్తుల కోసం పలు దఫాలుగా చర్చలు జరిపారు. అయితే ఈ విషయంలో వారి మధ్య అవగాహన కుదరలేదని… అనేక రకాల వార్తలు వచ్చాయి.

YS Jagan And Pawan Kalyan In Between KCR-Chandrababu Naidu Elections AP Janasena Party KCR TDP TRS YCP

YS Jagan And Pawan Kalyan In Between KCR

ఈ మధ్యన పవన్ అన్నయ్య నాగబాబు వైసీపీ నేతలతో రహస్యంగా కూడా ప్రచారం జరిగింది. కానీ ఈ విషయాన్ని జగన్ గాని, పవన్ కానీ ఒప్పుకోలేదు సరి కదా ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ నే ఉన్నారు. ఇదిలా ఉండగానే పొత్తుల కోసం వైసిపి జనసేన తో కలిసేందుకు టిఆర్ఎస్ పార్టీ తో వైసిపి రాయబారాలు నడుపుతోందని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

YS Jagan And Pawan Kalyan In Between KCR-Chandrababu Naidu Elections AP Janasena Party KCR TDP TRS YCP

పార్టీని పటిష్టం చేసే పనిలో భాగంగా… జిల్లాల వారీగా సమీక్షలు చేస్తున్న పవన్ కళ్యాణ్.. కార్యకర్తలతో ఈ విషయాల గురించి మాట్లాడ్డం రాజకీయంగా సంచలనం కలిగించింది. అసలు జనసేనకు బలమే లేదని … వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారని…మరి అటువంటప్పుడు ఈ రాయబారాలు ఎందుకని పవన్ చెప్పుకొచ్చారు. అయితే ఈ రెండు పార్టీలు పొత్తు విషయంలో టీఆర్ఎస్ పార్టీ పవన్ తో ఏం చెప్పింది దానికి పవన్ సమాధానం చెప్పాడు అనే విషయాలు మాత్రం ఆయన ఎక్కడ బయట పెట్టలేదు. అసలు ఏపీలో కుల సమీకరణాలు లెక్కన చూస్తే వైసీపీ జనసేన కలిస్తే టీడీపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంది అలా కాకుండా ఎవరికి వారు విడివిడిగా పోటీ చేస్తే ఓట్లు చీలిపోయే ప్రమాదం కూడా ఉంది అంతే కాదు అది కాస్తా టిడిపికి కలిసి వస్తుంది. ఇదే విషయాన్ని టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా… జగన్ పవన్ ల చెవిన వేసారట.

YS Jagan And Pawan Kalyan In Between KCR-Chandrababu Naidu Elections AP Janasena Party KCR TDP TRS YCP

తెలంగాణ లో టీఆర్ఎస్ పార్టీ గెలిచిన తరువాత కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చంద్రబాబు గురించి మాట్లాడాడు..బాబు నాకు గిఫ్ట్ ఇచ్చాడు… నేను రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా అంటూ వ్యాఖ్యానించాడు. అయితే ఆ రిటర్న్ గిఫ్ట్ ఏంటో ఎవరికీ అర్ధం కాలేదు. అయితే… వైసీపీ జనసేన పార్టీలను కలపడమే బాబు కి కేసీఆర్ ఇచ్చే గిఫ్ట్ అని ఇప్పుడు అంతా అర్ధం చేసుకుంటున్నారు.వాస్తవంగా చూస్తే పవన్ జగన్ ఇద్దరు టిఆర్ఎస్ పార్టీ తో సత్సంబంధాలు కలిగి ఉన్నారు కేసీఆర్ చెప్పిన మాటలను మీరు పాటిస్తారు అదే నమ్మకంతో కేసీఆర్ కూడా వీరిద్దరిని కలపాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి బలం చేకూర్చేలా పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది