టార్గెట్ బాబు : ఈ విషయంలో ఇద్దరిదీ ఒకటే మాట ఒకటే బాట !  

Ys Jagan And Modi Targets Chandrababu Naidu-

టీడీపీ అధినేత చంద్రబాబు కి ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తోంది.ఏపీలో అధికారం కోల్పోవడమే కాకుండా తనకు రాజకీయ బద్ద విరోధులుగా ఉన్నవారంతా ఇప్పడు అధికారంలో ఉండడం, వారంతా తననే టార్గెట్ చేసుకుని అన్ని వ్యవహారాల మీద ఏంక్వైరీలు చేయించడం బాబు కి ఆగ్రహాన్ని,భయాన్ని కలిగిస్తున్నాయి.కేంద్రంలో బీజేపీతోనూ, తెలంగాణాలో టీఆరఎస్ తోనూ, ఏపీలో వైసీపీతోనూ బాబు కి పీకల్లోతు రాజకీయ కక్షలు ఉన్నాయి...

Ys Jagan And Modi Targets Chandrababu Naidu--YS Jagan And Modi Targets Chandrababu Naidu-

వీరంతా ఇప్పుడు తనను టార్గెట్ గా చేసుకుని రాజకీయాలు చేయడం, గత టీడీపీ ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలు, నిర్ణయాల మీద విచారణ లు చేయించడం బాబు కి మింగుడుపడడంలేదు.జగన్ మాత్రం సైలెంట్ గా చంద్రబాబు హయాంలో చోటు చేసుకున్న అవినీతిపై ఇప్పుడు విచారణలు చేయించడం మొదలు పెట్టడంతో బాబు లో ఎక్కడలేని ఆందోళన కనిపిస్తోంది.

Ys Jagan And Modi Targets Chandrababu Naidu--YS Jagan And Modi Targets Chandrababu Naidu-

ముఖ్యమా చంద్రబాబు ప్రభుత్వంలో తీసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాన్ని రద్దు చేసి పున: సమీక్షిస్తామని, ఇందులో పెద్దఎత్తున అవినీతి చోటు చేసుకుందని, యూనిట్ ధరను భారీగా పెంచి సదురు కంపెనీలకు లబ్ధి చేకూర్చి తద్వారా టీడీపీ కూడా బాగా లాభపడింది అనేది జగన్ అనుమానంగా కనిపిస్తోంది.అయితే విద్యుత్ కొనుగోళ్ళకు సంబంధించి జగన్ ప్రకటన చేసిన వెంటనే టీడీపీ కూడా అలెర్ట్ అయ్యింది.

సదురు కంపెనీల సాయంతో కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శితో ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు లేఖ కూడా రాయించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇలా పాత ప్రభుత్వం చేసిన విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు రద్దు చేయడం రాష్ట్రానికి మంచిది కాదని, దీనివల్ల ఏపీకి పెట్టుబడులు రావని, పారిశ్రామికవేత్తలు వెనుకడుగు వేస్తారని సదరు ఇంధన శాఖ కార్యదర్శి ఏపీ సీఎస్ కు లేఖలో సూచించారట..

అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న జగన్ నేరుగా తిరుపతికి వచ్చిన మోదీ వద్దకు తీసుకెళ్లారట.ఆయనతో రహస్య భేటిలో ఇదే విషయం పై చర్చించినట్టు పార్టీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి.

చంద్రబాబు సర్కారు ముఖ్యంగా పవన్ విద్యుత్ విషయంలో రూపాయికి యూనిట్ వచ్చే విద్యుత్ ను రూ.5, రూ.6 వరకు పెంచి టీడీపీ అనుకూల కంపెనీలకు దోచిపెడుతోందని.దీన్ని రద్దు చేస్తానని అంటే మీ కేంద్ర కార్యదర్శి లేఖ రాశాడని ఆ లేఖను మోదీకి చూపించడంతో చంద్రబాబు మీద పీకల్లోతూ కోపంగా ఉన్న మోదీ టెండర్ల రద్దు విషయాన్ని సమర్దించి దీనిపై ఒక ఎంక్వయిరీ కమిటీ వేయాల్సిందిగా సూచించారట...

ఇప్పుడు ఆ పని వేగవంతం అయ్యేలా జగన్ చురుగ్గా నిర్ణయాలు తీసుకోవడంతో బాబు లో ఎక్కడలేని ఆందోళన కనిపిస్తోంది.