జగన్‌, కేసీఆర్‌ కలిస్తే ఏం చేయగలరు  

Ys Jagan And Kcr Role In Central జగన్‌-andhra Pradesh,ap Elections,chandrababu Naidu,congress,kcr,ktr,ycp,ys Jagan,కేసీఆర్,జగన్

తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం ఎంపీ స్థానాలను గెలిచి క్లీన్‌ స్వీప్‌ చేయాలని కేసీఆర్‌ పట్టుదలతో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాడు. ఎన్నికలు పూర్తి అయ్యాయి, ఖచ్చితంగా మంచి ఫలితం అయితే వస్తుందని కేసీఆర్‌ నమ్మకంగా ఉన్నాడు. మరో వైపు ఏపీలో కూడా ఈసారి వైకాపాదే అధికారం అంటూ ఆ పార్టీ నాయకులు చాలా ధీమాతో ఉన్నారు...

జగన్‌, కేసీఆర్‌ కలిస్తే ఏం చేయగలరు-Ys Jagan And Kcr Role In Central జగన్‌

ఈ సమయంలోనే వైకాపా సాధించబోతున్న ఎంపీ స్థానాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.జగన్‌ సాయంతో కేసీఆర్‌ కేంద్రంలో చక్రం తిప్పాలని ఉవ్విల్లూరుతున్నాడు. ఇప్పటికే ఫెడరల్‌ ఫ్రంట్‌ అంటూ చాలా రాష్ట్రాల్లో సీఎం కేసీఆర్‌ పర్యటించిన విషయం తెల్సిందే.

ఈ సమయంలోనే జగన్‌కు కొన్ని చోట్ల పాజిటివ్‌ రెస్పాన్స్‌ రాగా, కొన్ని చోట్ల ఆసించిన స్థాయిలో మంచి రెస్పాన్స్‌ అయితే రాలేదు. దాంతో ఏం చేయాలో పాలుపోని కేసీఆర్‌ ఇప్పుడు జగన్‌ పార్టీ సాధించబోతున్న ఎంపీ స్థానాలపై లెక్కలు వేస్తున్నట్లుగా తెలుస్తోంది.రెండు పార్టీలు కలిసి కనీసం 30 సీట్లను గెలచుకుంటే మాత్రం అప్పుడు కేసీర్‌ క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది. కేంద్ర రాజకీయాలపై జగన్‌కు అంతగా ఆసక్తి లేని కారణంగా కేసీఆర్‌ క్రియాశీలకంగా వ్యవహరిస్తాడు.

ఒక వేళ వైకాపా రాష్ట్రంలో అధికారం దక్కించుకుంటే జగన్‌ ఢిల్లీ వైపు కూడా చూడడు.ఈ ఉద్దేశ్యంతోనే కేసీఆర్‌, జగన్‌కు చాలా సన్నిహితంగా ఉంటున్నాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కేంద్రంలో ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ రాని సమయంలో కేసీఆర్‌ నిర్ణయం కీలకం కాబోతుంది.

ఇప్పటికే జగన్‌ కాంగ్రెస్‌తో వద్దనుకున్నాడు. మరి బిజేపీతో కేసీఆర్‌ మరియు జగన్‌ కలిసి మోడీకి సాయం అవుతారేమో చూడాలి.