ఓహో ! జగన్ - పవన్ అక్కడ కలిశారా..? ఆ పార్టీ ఇలా చెప్పడానికి కారణం ఏంటి !   YS Jagan And Janasena Will Be Tie Up In Telangana     2018-11-10   13:57:38  IST  Sai M

వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఖరారయిపోయాయి … జగన్ పవన్ కలిసిపోయారు. టీడీపీni ఓడించడానికి వీరిద్దరూ కలిసి కుట్ర చేస్తున్నారు. జనసేన- వైసీపీ మధ్య సీట్ల బేరం తెగడంలేదు. పవన్ – జగన్ ఇద్దరూ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం కొద్దికాలంగా తగ్గిపోయింది. దీనంతటికి కారణం వారిద్దరి మధ్య ఒక అవగాహనే కారణం ఇలా రకరకాల పుకార్లు వైసీపీ జనసేన పార్టీల గురించి వచ్చాయి. అయితే… అందులో ఎంతవరకు నిజం ఉంది అనేది స్పష్టంగా తెలికపోయినా.. ఈ విషయంలో టీడీపీ మాత్రం ప్రచారం గట్టిగా చేస్తోంది. దీనికి కారణం జగన్ పవన్ తమ స్వార్థం కోసం ఇద్దరూ కలిసిపోయి టీడీపీని ఒంటరిని చేసి దబ్బకొట్టాలని చూస్తున్నారని టీడీపీ తమకు సానుభూతి వచ్చేలా ప్రచారం చేసుకుంటోంది.

వైసీపీ – జనసేన పొత్తుల విషయంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ విషయంలో క్లారిటీ ఇచ్చాడు పవన్. తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోవడం లేదని, దీనిపై వస్తున్న ప్రచారాలను నమ్మవద్దు అంటూ చెప్పాడు. అదే విధంగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా.. పొత్తు ఉండదు, ఎవరితోనూ పొత్తు పెట్టుకోం అని చెబుతున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కొత్త ప్రచారాన్ని మొదలుపెట్టింది. అదేమిటంటే.. జగన్, పవన్ లు సమావేశం అయ్యారు.. అని టీడీపీ వర్గాలు ప్రచారం మొదలుపెట్టాయి. ఇటీవలే అది జరిగిందని.. విశాఖ వేదికగా వాళ్లిద్దరూ కలిశారని తెలుగుదేశం సంచలన ఆరోపణలు చేసింది . అంతే కాదు విశాఖలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఒకరింట్లో ఈ సమావేశం అంటూ బల్లగుద్ది మరీ టీడీపీ చెబుతోంది.

YS Jagan And Janasena Will Be Tie Up In Telangana-

అంతే కాదు జగన్ – పవన్ భేటీలో సీట్ల పంపకాలపై కూడా జరిగిందని.. జగన్ దాదాపు నలభై సీట్లను ఆఫర్ చేస్తున్నాడని, అయితే పవన్ ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నాడని టీడీపీ చెబుతోంది. అందుకే వీరి మధ్య న పొత్తు ఖరారు కాలేదని టీడీపీ అంటోంది. అయితే వీరిద్దరి అంతిమ లక్ష్యం మాత్రం టీడీపీ ఓటమేనని .. అయితే వారి ఆశలు తీరే ఛాన్స్ లేదని టీడీపీ బలంగా వాదిస్తోంది. టీడీపీ ఇటువంటి ఆరోపణలు చేయడం వెనుక కారణాలు కూడా లేకపోలేదు. వచ్చే ఎన్నికల్లో ఎలాగూ త్రిముఖ పోరు తప్పదు. ఈ నేపథ్యంలో ప్రజల్లో టీడీపీకి సానుభూతి వచ్చేలా చేయడంతో పాటు … జనసేన వైసీపీ రెండు ఒకటేనని .. ప్రజలకోసం కష్టపడే టీడీపీపై వీరు కుట్ర చేస్తున్నారు అంటూ ప్రచారం చేసుకుని సానుభూతి కొట్టేయాలని టీడీపీ ఆలోచన చేస్తోందని .. జనసేన , వైసీపీ పార్టీలు ఆరోపిస్తున్నాయి.