జగన్ చిరు భేటీ ...? జనసేన - వైసీపీ పొత్తు పై క్లారిటీ వచ్చిందా ...?

ఏపీలో జనసేన… వైఎస్సార్ కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు వేరు వేరు దారుల్లో వెళ్తున్నాయి.ఈ రెండు పార్టీల సిద్ధాంతాలు.

 Ys Jagan And Chiranjeevi Meets About Janasena And Ycp Tie Up-TeluguStop.com

ఆలోచనలు వేరు వేరు.వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకోవాలని ఈ రెండు పార్టీల అధినేతలు కలలు కంటున్నారు.

ఈ దశలో ఈ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి ఉంది.అంతే కాదు వీరి విమర్శలు మరింత ముదిరి వ్యక్తిగతంగా తిట్టుకునే స్థాయివరకు వెళ్ళిపోయింది.కానీ… ఇదే సమయంలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు అంశం కూడా బాగా ప్రచారం సాగుతోంది.జనసేన – వైసీపీ వచ్చే ఎన్నికల్లో కలిసికట్టుగా బరిలోకి వెళ్లి తమ ఉమ్మడి ప్రత్యర్థి అయిన టీడీపీకి మరోసారి అధికారం దక్కకుండా చేయాలనే ఆలోచన ఈ ఇరు పార్టీల అధినేతలకు కూడా మధ్య ఉంది.

కాకపోతే బహిరంగంగా మాత్రం ఈ విషయం మీద స్పందించడంలేదు.

కొద్దిరోజుల క్రితం వైసీపీ నేతలతో… పవన్ అన్నయ్య నాగబాబు భేటీ అయ్యాడని… పొత్తులు విషయంలో క్లారిటీ రాబోతోంది అని వార్తలు వచ్చిన నేపథ్యంలోనే తాజాగా… మెగాస్టార్ చిరంజీవి కూడా… జగన్ తో భేటీ అయ్యారనే వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి.అంతే కాదు దీనికి సంబంధించి జగన్, చిరంజీవులు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి.అయితే ఫోటోను చూస్తే రెండు రోజుల క్రితమే జగన్ ని చిరంజీవి కలిశారంటూ కూడా ప్రచారం జోరుగా సాగుతోంది.

జగన్ తో చిరంజీవి భేటీ కావడం వెనుక ఆంతర్యం చాలా దాగి ఉందని ప్రచారం జరుగుతుంది.రాజకీయాల్లో బలమైన నాయకుడిగా ముద్ర వేయించుకున్న చంద్రబాబును రాజకీయ చాణుక్యుడుగా పిలుస్తారు.

ఎన్నికల సమయంలో ఏదో చేసి గెలుపొందేలా ప్లాన్ లు వేస్తారని అంతా చెప్పుకుంటారు.అటువంటి బాబు ని విడి విడిగా ఎదుర్కోవడం కంటే… కలిసి పోటీ చేసి టీడీపీ ని ఓడించవచ్చని….

అందుకే ఈ రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

జనసేన పార్టీకి చెందిన ప్రతినిధులు, వైసీపీ కి చెందిన నేతలతో ఇటీవలే భేటీ అయ్యారని ప్రచారం జరగుతోంది.ఆ భేటీలో జనసేన 45 అసెంబ్లీ స్థానాలను 8 పార్లమెంట్ స్థానాలను ఇవ్వాలంటూ ప్రతిపాదించినట్లు ప్రచారం జరుగుతోంది.ఇదే అంశాన్ని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి కళా వెంకట్రావు సైతం ఆరోపించారు.

జనసేన పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు రహస్యంగా కలుసుకుంది వాస్తవం కాదా అంటూ నిలదీస్తున్నారు.ఇక జగన్ కి పవన్ కి మధ్య కొంతకాలం క్రితం వ్యక్తిగత దూషణలు శృతిమించడంతో…ఈ రెండు పార్టీల పొత్తుకు అడ్డం పడే అవకాశం ఉండడంతో నేరుగా చిరు రంగంలోకి దిగారనే ప్రచారం జరుగుతోంది.

అదీకాకుండా ఈ వ్యవహారాలన్నీ ఒక కొలిక్కి వస్తే మెల్లిగా మెగా ఎంట్రీ ఇచ్చేనందుకు చిరు కూడా మంచి ఉత్సాహంగా ఉన్నాడు.అయితే ఈ పొత్తు వ్యవహారం ఎప్పటికి తేలుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube