జగన్ ఎవరికీ అర్ధంకావడంలేదా ? వారి ఆగ్రహానికి కారణం ఏంటి ?

ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పది నెలల కాలంలోనే జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలు, నిర్ణయాలపై దేశవ్యాప్తంగా చర్చ మొదలయ్యింది.అంతే కాదు ఇక్కడి సంక్షేమ పథకాలు, నిర్ణయాలు తమ తమ రాష్ట్రాల్లో అమలు చేసేందుకు చాలా రాష్ట్రాలు ముందుకు వచ్చాయి.

 Ys Jagan, Ap,schemes,funds,corona, Ammavodi Scheme-TeluguStop.com

అన్ని రాష్ట్రాల సీఎం లకు జగన్ రోల్ మోడల్ గా నిలిచారు.ఇక ప్రజలకు కూడా ఇబ్బడిముబ్బడిగా సంక్షేమ పథకాలు అమలు చేయడం, దేనికోసం ఎవరు ఏ ఆఫీస్ ల చుట్టూ తిరగకుండా వలంటీర్ల వ్యవస్థ ను ప్రవేశపెట్టడం నిజంగా జగన్ నిర్ణయాల్లో హైలెట్.

ఇప్పుడు వలంటీర్ల వ్యవస్థపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.తమ తమ రాష్ట్రాల్లో ఈ విధానాన్ని అమలు చేసేందుకు చాలా రాష్ట్రాలు ఆసక్తి చూపిస్తున్నాయి.

మొదట్లో జగన్ నిర్ణయాలు కాస్త వివాదాస్పదంగా అనిపించినా ఆ తరువాత వాటి ఫలితాలు సానుకూలంగా వస్తున్నాయి.మొత్తంగా జగన్ పాలన జనరంజకంగా ఉంది అనేది మెజార్టీ జనాల టాక్.

ఇదంతా నాణానికి ఒకవైపు వెర్షన్.మరోవైపు చూసుకుంటే, జగన్ పాలపై కొన్ని కొన్ని వర్గాలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నాయట.సంక్షేమ పథకాల పేరుతో జగన్ ప్రజా ధనాన్ని బాగా దుర్వినియోగం చేస్తూ, అనవసరంగా ఖజానా ఖాళీ చేస్తున్నారనే అభిప్రాయం ఉద్యోగస్తులు, మేధావి వర్గాల్లో కనిపిస్తోంది.అసలు ఇప్పుడు ఈ కరోనా కష్టకాలంలోనూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం దృష్టిలో పెట్టుకోకుండా జగన్ ఇప్పుడు కూడా సంక్షేమ పథకాల పేరుతో భారీగా నిధులు ఖర్చు పెడుతున్నారని మేధావి వర్గం జగన్ పాలన పై ఆగ్రహంగా ఉంది.

అలాగే అమ్మవడి కార్యక్రమానికి ఒక్కో విద్యార్థి తల్లి ఖాతాలో 15000 చెల్లించి, ఇప్పుడు ఉద్యోగస్తుల జీతాల్లో కోతలు విధించడంపై ఉద్యోగస్తులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తుంది.

Telugu Ammavodi Scheme, Corona, Funds, Schemes, Ys Jagan-Telugu Political News

అలాగే కరోనా కారణంగా బడులు మూసివేయడంతో ఈ సమయంలోనూ విద్యార్థుల ఇంటికి బియ్యం, పప్పు, ఉప్పులు పంచడంపైన తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.ఇప్పటికే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనవసరంగా సొమ్ములు ఖర్చు పెట్టారనేది చాలా మంది అభిప్రాయం. అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, ఆటో డ్రైవర్లకు 10 వేలు, కరోనా బాధితులు కోలుకున్న తర్వాత 2000 ఇవ్వడం, ఇలా అనవసర ఖర్చులు ఎక్కువగా పెడుతున్నారు అనేది ఒక వర్గం ప్రజల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయం.

ఒకవైపు ఏపీకి అప్పుల భారం ఎక్కువగా ఉంది.ఈ సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో పొదుపు చర్యలు పాటించకుండా ఇప్పుడు కూడా దుబారా ఖర్చులు చేయడంపై విమర్శలు పెరిగిపోతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube